పవన్ కల్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి క్రేజ్: ఆనంది
- పవన్ కల్యాణ్ తన చిన్ననాటి క్రష్ అని చెప్పిన నటి ఆనంది
- ఆయన మ్యానరిజమ్స్, స్టైల్ అంటే తనకు ఇష్టమని వెల్లడి
- పవన్ సినిమా వస్తే ఇంట్లో పండగ వాతావరణం ఉంటుందని వ్యాఖ్య
తెలుగు, తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంది.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చిన్నప్పటి నుంచి తాను పవన్ కల్యాణ్‌కు పెద్ద అభిమానినని, ఆయనే తన క్రష్ అని ఆమె తన మనసులోని మాటను వెల్లడించారు.
తన తాజా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆనంది మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా, మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. "చిన్నప్పటి నుంచి నాకు పవన్ కల్యాణ్ గారంటే ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే చిన్నతనం నుంచే ఆయనే నా క్రష్" అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోందంటే చాలు, తమ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని ఆమె వ్యాఖ్యానించారు. వెండితెరపై ఆయన ప్రదర్శించే విలక్షణమైన మ్యానరిజమ్స్, స్టైల్‌ను తాను ఎంతగానో ఇష్టపడతానని తెలిపారు. నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా పవన్‌పై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆనంది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.