ఏపీలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నాం: రామ్మోహన్ నాయుడు

Andhra
Advertisement
  • కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తయిందన్న రామ్మోహన్ నాయుడు
  • భోగాపురం ఎయిర్‌పోర్టుతో పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ధీమా
  • విశాఖ ఎకనామిక్ రీజియన్ త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందన్న కేంద్ర మంత్రి
ఏపీలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం, కుప్పం, నాగార్జున సాగర్ సమీపంలో, అమరావతి వంటి ప్రాంతాల్లో ఈ నూతన విమానాశ్రయాలు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక మినీ ఎకనామిక్ సిటీగా రూపాంతరం చెందనుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఈ ప్రాంత అభివృద్ధికి ఒక చోదకశక్తిగా పనిచేస్తుందని, వలసలను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రలో భారీ పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'విశాఖ ఎకనామిక్ రీజియన్' కూడా త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ram Mohan NaiduAndhra Pradesh New AirportsBhogapuram International AirportSrikakulam Kuppam AirportsCivil Aviation MinistryUttarandhra Economic Development

More Telugu News

భారత పాస్‌పోర్ట్‌తో ఇప్పుడు ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చో తెలుసా?

22 Nov, 15:54

నైట్ షిఫ్ట్ చేసేవారికి హెచ్చరిక.. గుండె నిర్మాణమే మారిపోతుందని అధ్యయనంలో వెల్లడి

22 Nov, 15:46

మరింత క్వాలిటీ కోసం.. రష్మిక మందన్న 'మైసా' విడుదల వాయిదా

22 Nov, 15:37

పంచాయతీ ఎన్నికల్లో పంతాలకు పోవద్దు: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

22 Nov, 15:22

బంగారం కంటే అయోధ్య భూములే మేలా.. ఎందులో ఎక్కువ లాభాలు?

22 Nov, 15:12

ఒప్పందం కంటే ముందే ప్రాజెక్టు పూర్తి.. అయినా కెనడా బిల్డర్ కు ఎదురుదెబ్బ.. ఎందుకంటే..!

22 Nov, 15:00

తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్!

22 Nov, 14:48

సిద్ధిపేట 'సదర్'లో హరీశ్ రావు జోష్.. ఫొటోలు ఇవిగో!

22 Nov, 14:38

కూతురికి భారం కాకూడదని.. 80 ఏళ్ల వయసులో తన తద్దినం తానే చేసుకున్న వృద్ధుడు

22 Nov, 14:19

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ.. ఎవరైనా పోటీ చేయవచ్చు: పవన్ కల్యాణ్ ప్రకటన

22 Nov, 14:09

వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. అరంగేట్రంలోనే అదరగొట్టిన యువ పేసర్ జంషెడ్ ఆలం!

22 Nov, 14:03

భీమవరం వద్ద జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం

22 Nov, 13:57

రూ.10 లక్షల లంచం కేసులో దొరికిన అధికారి.. ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు!

22 Nov, 13:54

పసిడి పతనం.. కొనాలా? ఆగాలా?.. రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే?

22 Nov, 13:43

వందే భారత్‌లో రూ.2 లక్షల నగదు మర్చిపోయిన టూరిస్ట్.. నిజాయతీ చాటుకున్న రైల్వే సిబ్బంది

22 Nov, 13:34
..More Telugu News