ప్రధాని మోదీకి జగన్ శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి జగన్ శుభాకాంక్షలు

Jagan Mohan Reddy conveys wishes to PM Modi
  • ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోదీకి 25 ఏళ్లు పూర్తి
  • దీన్ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించిన జగన్
  • ఈసీపై విమర్శల వేళ జగన్ శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారిన వైనం
ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ప్రధానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని ఒక 'చరిత్రాత్మక మైలురాయి'గా జగన్ తన పోస్ట్‌లో అభివర్ణించారు. "గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధానిగా నిరంతరాయంగా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు" అని ఆయన పేర్కొన్నారు. 

మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా, తర్వాత 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధానిని ప్రశంసించారు. "భారతదేశానికి సరైన సమయంలో, సరైన ప్రదేశంలో సరైన నాయకుడు లభించారు" అని పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో ప్రధానితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వంటి అంశాలపై కేంద్రంపై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో జగన్ వ్యక్తిగతంగా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేంద్ర సంస్థలపై విమర్శలు చేస్తూనే, మరోవైపు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపడంపై రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది.

Advertisement
Narendra Modi
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
25 years public service
Gujarat Chief Minister
Andhra Pradesh politics

More Telugu News