కొత్త స్కూటర్లు వచ్చేశాయ్‌.. రూ.1.11 లక్షల నుంచే ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ!
Advertisement

కొత్త స్కూటర్లు వచ్చేశాయ్‌.. రూ.1.11 లక్షల నుంచే ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ!

Aprilia SXR GT New Scooters Launched Starting From Rs 1-11 Lakh
  • ఎప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ సిరీస్‌లో రెండు స్కూటర్లు విడుదల
  • ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 ధర రూ.1.11 లక్షలు
  • ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 ధర రూ.1.31 లక్షలు
  • జీటీ 175లో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్‌
  • జీటీ 175లో సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌
ప్రీమియం మ్యాక్సీ స్కూటర్‌ కోరుకునే వారికి ఎప్రిలియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ సిరీస్‌లో రెండు కొత్త స్కూటర్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 ధర రూ.1.11 లక్షలు కాగా.. ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 ధర రూ.1.31 లక్షలుగా నిర్ణయించింది. ఇవి రెండూ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. గతంలో ఉన్న ఎస్‌ఎక్స్‌ఆర్‌ 125, ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 మోడళ్లను నిలిపివేసిన తర్వాత కొత్త జీటీ సిరీస్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

రెండు ఇంజిన్లు.. రెండు ధరలు
ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125లో 124.5cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 10.6 hp పవర్‌, 10.4 Nm టార్క్‌ అందిస్తుంది. ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175లో 174.7cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 13.3 hp పవర్‌, 14.1 Nm టార్క్‌ ఇస్తుంది. రెండు ఇంజిన్లు బీఎస్‌6 ఓబీడీ-II స్టేజ్‌ బీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ20 పెట్రోల్‌ను కూడా ఇవి సపోర్ట్‌ చేస్తాయి.

14 అంగుళాల వీల్స్‌ ప్రత్యేకత
కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ సిరీస్‌లో కీలక మార్పుల్లో 14 అంగుళాల వీల్స్‌ ఒకటి. పెద్ద వీల్స్‌ వల్ల గుంతలు, అసమాన రోడ్లపై స్కూటర్‌ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. నగర రోడ్లపై కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు కూడా రైడర్‌కు మరింత నమ్మకం కలిగించొచ్చు.

జీటీ 175లో అదనపు ఫీచర్లు
ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ ద్వారా కాల్స్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్‌ ఉపయోగించుకోవచ్చు. టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా హ్యాండిల్‌బార్‌ కంట్రోల్స్‌, సింగిల్‌-ఛానల్‌ ఏబీఎస్‌ ఉన్నాయి. ఎగ్జాస్ట్‌ ఎండ్‌ పైప్‌, హీట్‌ షీల్డ్‌లో కూడా మార్పులు చేశారు.

జీటీ 125లో ఎలా ఉన్నాయి?
ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125లో 5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. ఇందులో ఏబీఎస్‌కు బదులుగా సీబీఎస్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఇచ్చారు. చిన్న ఇంజిన్‌, ఈ బ్రేకింగ్‌ సెటప్‌ కారణంగా 175తో పోలిస్తే దీని ధర తక్కువగా ఉంది.

మొత్తంగా చూస్తే కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ సిరీస్‌లో పాత మ్యాక్సీ స్కూటర్‌ డిజైన్‌ను కొనసాగిస్తూనే.. కొత్త ఇంజిన్లు, పెద్ద వీల్స్‌, అప్‌డేటెడ్‌ ఫీచర్లను తీసుకొచ్చింది. నగర ప్రయాణాలతో పాటు ఎక్కువ దూరం వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని జీటీ సిరీస్‌ను రూపొందించారు.
Advertisement
Aprilia
Aprilia SXR GT 125
Aprilia SXR GT 175
Maxi Scooter India
Aprilia Scooter Price
New Scooter Launch India

More Telugu News