సిరాజ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌.. వీడియో ఇదిగో!
Advertisement

సిరాజ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌.. వీడియో ఇదిగో!

Mohammed Siraj narrowly escapes injury Rohit Sharma reaction goes viral
  • రనౌట్‌ కోసం బాల్‌ విసిరిన గుర్నూర్‌ బ్రార్
  • సిరాజ్‌ తలకు బలంగా తగిలేలా దూసుకొచ్చిన బంతి
  • నేలపై ఉన్న సిరాజ్‌ తలకు కొద్దిగా పైనుంచి వెళ్లిన బాల్‌
  • ఏం జరిగిందో అర్థంకాక చూస్తుండిపోయిన సిరాజ్‌
  • ఘటన చూసి నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్‌
భారత్‌-వెస్టిండీస్‌ మూడో వన్డేలో మహ్మద్‌ సిరాజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రనౌట్‌ కోసం గుర్నూర్‌ బ్రార్‌ విసిరిన బంతి సిరాజ్‌ తలకు బలంగా తగిలేలా దూసుకొచ్చింది. ఆ సమయంలో సిరాజ్‌ నేలపై పడుకుని ఉండగా.. బ్రార్‌ వికెట్లను లక్ష్యంగా చేసుకుని బంతిని విసిరాడు. అయితే అదృష్టవశాత్తూ బంతి సిరాజ్‌ తలకు కొద్దిగా పైనుంచి వెళ్లిపోయింది.

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిరాజ్‌.. ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తుండిపోయాడు. ఈ ఘటనను చూసిన రోహిత్‌ శర్మ నవ్వు ఆపుకోలేకపోయాడు. దీంతో మైదానంలో కాసేపు సరదా వాతావరణం నెలకొంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ వెస్టిండీస్‌ ముందు 352 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో కోహ్లీ, గిల్‌ నిరాశపర్చినా.. రోహిత్‌, గైక్వాడ్‌ మ్యాచ్‌ను గాడిలో పెట్టారు. తర్వాత వచ్చిన రాహుల్‌ తనదైన శైలిలో ఆడుతూ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకొని 129 పరుగుల వద్ద తన కెరీర్‌ బెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేసుకున్నాడు.

ప్రస్తుతం బౌలింగ్ చేస్తున్న భారత్‌.. వెస్టిండీస్‌ను కట్టడి చేసేందుకు శ్రమిస్తోంది. అద్భుతమైన బాల్‌తో క్యాంప్‌బెల్‌ను సిరాజ్‌ ఔట్‌ చేసినప్పటికీ.. జంగూతో కలిసి హోప్‌ ఇన్నింగ్స్‌ను బలంగా నిర్మిస్తున్నాడు. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి వెస్టిండీస్‌ ఒక వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది.  
Advertisement
Mohammed Siraj
Rohit Sharma
India vs West Indies 3rd ODI
KL Rahul Century
Cricket Viral Video
Mohammed Siraj Injury Scare

More Telugu News