అక్టోబరు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్
- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
- అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
- వివరాలు వెల్లడించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
- ఈ సీజన్‌లో ఏపీలో 34.9 శాతం మేర వర్షపాతం లోటు
నైరుతి రుతుపవనాల సీజన్‌లో తీవ్ర వర్షపాత లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణానికి సంబంధించిన మరో కీలక అప్‌డేట్ వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 12వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడనుంది. అక్టోబర్ 15 నాటికి ఇది దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని గమనం, తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని, వాతావరణ పరిస్థితులను బట్టి మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్ 1 - సెప్టెంబర్ 30) రాష్ట్రంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సగటున 589.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 383.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 34.9 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.