విద్యుత్ వాహన విక్రయాల్లో మహీంద్రా కీలక మైలురాయి.. అమ్మకాలు లక్ష దాటేశాయ్!
- బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈతో ఈవీ ప్రయాణం మొదలు
- తొలిరోజే 30,179 బుకింగ్స్ నమోదు
- ఎక్స్‌ఈవీ 9ఎస్‌కు పెరుగుతున్న డిమాండ్
- ఆగస్టులో ఎక్స్‌ఈవీ 9ఎస్ విక్రయాలు 4,508
- సెప్టెంబర్‌లో 14 శాతం పెరిగిన ఎస్‌యూవీ అమ్మకాలు
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా కీలక మైలురాయిని అందుకుంది. కంపెనీ బోర్న్ ఎలక్ట్రిక్ (బీఈ) శ్రేణి ఎస్‌యూవీల అమ్మకాలు లక్ష యూనిట్లు దాటాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించారు.
మొదటి ఈవీ ఎస్‌యూవీలైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ బుకింగ్స్‌ను 2025 ఫిబ్రవరిలో ప్రారంభించిన తర్వాత రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఈ స్థాయికి చేరడం విశేషం. బుకింగ్స్ తొలిరోజే మహీంద్రాకు 30,179 రిజర్వేషన్లు వచ్చాయి. వీటిన్నంటి ఎక్స్‌షోరూమ్ విలువ రూ.8,472 కోట్లుగా ఉంది. ఇందులో ఎక్స్‌ఈవీ 9ఈ వాటా 56 శాతం. అలాగే 73 శాతం మంది కస్టమర్లు టాప్ వేరియంట్ ప్యాక్ త్రీని ఎంచుకున్నారు.
2025 మార్చి 20న కస్టమర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9 నాటికి 3,000కుపైగా వాహనాలను అందించారు. నవంబర్ 2025 నాటికి బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ ఎస్‌యూవీలు 30 వేలకుపైగా భారత రోడ్లపైకి వచ్చాయి. అదే సమయంలో మరింత అందుబాటు ధరలో ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను తీసుకొచ్చారు. దీని డెలివరీలు 2026 జనవరిలో ప్రారంభమయ్యాయి.
2026 ఏప్రిల్ చివరి నాటికి బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ, ఎక్స్‌ఈవీ 9ఎస్ కలిపి 65,615 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందులో ఎక్స్‌ఈవీ 9ఈ 34,369 యూనిట్లతో ముందుంది. బీఈ 6 20,108 యూనిట్లు, ఎక్స్‌ఈవీ 9ఎస్ 11,138 యూనిట్ల అమ్మకాలు సాధించాయి. ఆ తర్వాత కూడా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగింది. 2026 ఆగస్టులో ఎక్స్‌ఈవీ 9ఎస్ విక్రయాలు 4,508 యూనిట్లకు చేరాయి.
ఈవీ అమ్మకాల జోరుతో మహీంద్రా మొత్తం ఎస్‌యూవీ విక్రయాలు కూడా పెరిగాయి. 2026 సెప్టెంబర్‌లో కంపెనీ మొత్తం ఆటో అమ్మకాలు 1,14,874 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ ఎస్‌యూవీ అమ్మకాలు 64,092 యూనిట్లకు చేరి 14 శాతం పెరిగాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 1,83,397 యూనిట్లకు చేరి 26 శాతం వృద్ధి సాధించాయి.