‘రణబాలి’ పాత్ర వెనుక ముగ్గురు రాయలసీమ వీరులు.. డైరెక్టర్ రాహుల్ ఆసక్తికర విషయాలు!
- రాయలసీమ వీరుల స్ఫూర్తితో ‘రణబాలి’
- విజయ్ పోషిస్తున్నది యోధుడి పాత్ర
- ముగ్గురు పాలెగాళ్ల జీవితాల ప్రభావం
- జానపద గాథల నుంచి కీలక అంశాలు
- బ్రిటిషర్లపై పోరాటం నేపథ్యం
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ఆసక్తి పెరుగుతోంది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన సింగనమల బొబ్బిలి రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్ర బృందం వెల్లడిస్తోంది.
‘రణబాలి’ పాత్రను రాయలసీమకు చెందిన ముగ్గురు పాలెగాళ్ల వీరోచిత గాథల నుంచి స్ఫూర్తి పొంది తీర్చిదిద్దినట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపారు. బుడ్డా వెంగళ్‌రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి జీవితాలు ఇందులో కీలకంగా నిలిచాయని చెప్పారు.
ఈ ముగ్గురు వీరుల కథలు ఇప్పటికీ రాయలసీమలో పాటల రూపంలో ప్రచారంలో ఉన్నాయని రాహుల్ తెలిపారు. వారి జీవితాల్లోని వీరోచిత ఘటనలు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథనాల నుంచి అంశాలను తీసుకుని ‘రణబాలి’ పాత్రను రూపొందించినట్లు వివరించారు. దీంతో విజయ్ పోషిస్తున్న పాత్ర వెనుక రాయలసీమ చరిత్ర, జానపద గాథల ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా విజయ్ దేవరకొండను ఈ సినిమాలో చూపించనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తోంది. పీరియాడికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాను దసరా సందర్భంగా అక్టోబరు 16న థియేటర్లలో విడుదల చేయనున్నారు.