ప్రపంచకప్‌కు ఏడాది ముందే ఆ పని చేయాలి.. యువరాజ్ కీలక సూచన
- 2027 ప్రపంచకప్‌పై యువరాజ్ మాస్టర్ ప్లాన్
- ఏడాది ముందే కోర్ జట్టు ఎంపిక చేయాలన్న మాజీ స్టార్
- 16 నుంచి 20 మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచన
- ఆటగాళ్లకు ప్రతి స్థానంలో అనుభవం అవసరమని వ్యాఖ్య
- టోర్నీకి నెల ముందే దక్షిణాఫ్రికాలో సాధన చేయాలని సూచన
- భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉందన్న రైనా
2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచే సత్తా ఉందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, టోర్నీకి ఏడాది ముందే 16 నుంచి 20 మంది ఆటగాళ్లతో కూడిన కోర్ టీమ్ ను సిద్ధం చేయాలని సూచించాడు. పదేపదే ఆటగాళ్లను మార్చకుండా, ప్రతి ఒక్కరికీ తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు.
“ప్రపంచకప్‌నకు ఏడాది ముందే జట్టును సిద్ధం చేయాలి. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఆడేవారికి తగినంత మ్యాచ్ అనుభవం ఉండాలి. ప్రపంచకప్ గెలవాలనే ఆలోచనతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకూడదు. ఎంపిక చేసిన 16 నుంచి 20 మంది ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. టోర్నీకి నెల రోజుల ముందే దక్షిణాఫ్రికా చేరుకుని సాధన చేయాలి” అని 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ జియోస్టార్‌తో చెప్పాడు.
2027 అక్టోబర్ 7 నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా ప్రపంచకప్ జరగనుంది. టోర్నీ షెడ్యూల్‌ను గురువారం కేప్‌టౌన్‌లో ప్రకటించారు. భారత్ తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘనిస్థాన్, క్వాలిఫయర్-ఏ జట్టు, ఆతిథ్య జట్టు జింబాబ్వేతోనూ భారత్ పోటీపడుతుంది. నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ జరగనుంది.
మరోవైపు, 2011 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన సురేశ్ రైనా.. ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ కంటే భారత్ ముందుందని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో పెరిగిన ఆత్మవిశ్వాసం, దూకుడైన బ్యాటింగ్ శైలి భారత జట్టుకు బలమని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే విజయం. 1983, 2011 తర్వాత 2027లోనూ భారత్ ప్రపంచకప్ గెలవాలని రైనా ఆకాంక్షించాడు.