నాటి యువగళం హామీ.. నేడు గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా సాకారం!
- 'యువగళం' పాదయాత్ర హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
- రాయలసీమలో రూ. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
- మదనపల్లె వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన సర్కార్
- 'సీడ్ టు షిప్‌మెంట్' విధానంలో ఉద్యాన రైతులకు పూర్తిస్థాయి చేయూత
- ప్రపంచానికే 'ఫ్రూట్ బౌల్'గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం
'యువగళం' పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ రాయలసీమ రైతాంగానికి ఇచ్చిన కీలక హామీ కార్యరూపం దాల్చింది. రూ.1 లక్ష కోట్ల భారీ ప్రణాళికతో రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాను ప్రపంచ స్థాయి ఉద్యాన కేంద్రంగా మార్చే 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' (జీహెచ్‌హెచ్)కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మదనపల్లె వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే కాక, ప్రపంచానికే 'ఫ్రూట్ బౌల్'గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ. లక్ష కోట్లతో సమగ్ర ప్రణాళిక
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి అదనంగా, ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించారు. 'సీడ్ టు షిప్‌మెంట్' విధానంలో విత్తనం వేసిన దగ్గర నుంచి పంటను ఎగుమతి చేసే వరకు ప్రతి దశలోనూ ఉద్యాన రైతులకు అండగా నిలవడమే ఈ హబ్ ముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్, రహదారుల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీలు, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖలతో సమీక్షలు జరపడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేలా ఒప్పించారు.
పాదయాత్రలో చూసి.. మిషన్ రాయలసీమగా మార్చి..
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ 'యువగళం' పేరుతో చరిత్రాత్మక పాదయాత్ర చేపట్టారు. రాయలసీమలో 124 రోజుల పాటు 1,587 కిలోమీటర్లు నడిచి, 44 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ సమయంలో లక్షలాది మంది రైతులను నేరుగా కలిసి వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. వారి ఇబ్బందులు చూసి చలించిపోయిన లోకేశ్.. 2023 జూన్ 7న కడపలో 'మిషన్ రాయలసీమ'ను ప్రకటించారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని భరోసా ఇచ్చారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ, ఫుడ్ ప్రాసెసింగ్, పల్పింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి హామీలను ఆనాడు ఇచ్చారు.
కరవు సీమ నుంచి ఫలాల సీమగా..
ఒకప్పుడు కరవుకు చిరునామాగా ఉన్న రాయలసీమ, ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా దేశంలోనే అగ్రగామి ఉద్యాన ప్రాంతంగా మారనుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్ వంటి సంప్రదాయ పంటలతో పాటు ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఆపిల్ బెర్రీస్ వంటి అధిక విలువ కలిగిన కొత్త రకం పంటల సాగుకు ప్రోత్సాహం లభించనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుంది.