2023 ఓటమి మరిచిపోలేదు.. 2027 వరల్డ్‌కప్‌పై గిల్ గురి!
- 2023 ఫైనల్ ఓటమి ఇంకా గుర్తుందన్న గిల్
- 2027 ప్రపంచకప్‌ను పూర్తి చేయాల్సిన పనిగా భావిస్తున్నానని వ్యాఖ్య
- తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్
- అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో మ్యాచ్
- వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమన్న కెప్టెన్
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2027 ప్రపంచకప్‌లో ఆ లోటును పూడ్చుకోవాలని గిల్ భావిస్తున్నాడు. వచ్చే ప్రపంచకప్ తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన అతడు.. దేశం తరఫున ప్రపంచకప్ ఆడే అవకాశం ప్రతిసారీ రాదని పేర్కొన్నాడు.
2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. నవంబర్ 21న ఫైనల్ జరుగుతుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ ఓడిన విషయం తెలిసిందే.
“2023 ప్రపంచకప్‌లో మేం చాలా బాగా ఆడాం. టోర్నీ మొత్తం చూస్తే మేమే అత్యుత్తమ జట్టులా కనిపించాం. కానీ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడకపోయినా ఫలితం మారిపోతుంది. ఆ మ్యాచ్ ఫైనల్ అయితే మరింత బాధగా ఉంటుంది. అందుకే 2027 ప్రపంచకప్‌ను మేం పూర్తి చేయాల్సిన పనిగా చూస్తున్నాం” అని గిల్ చెప్పాడు.
దేశం తరఫున ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని గిల్ అన్నాడు. “కెరీర్‌లో ఎన్ని ప్రపంచకప్‌లు ఆడగలమో చెప్పలేం. అందుకే దేశం తరఫున ప్రపంచకప్‌లో ఆడే ప్రతి అవకాశం ప్రత్యేకమే. మరోసారి ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది” అని గిల్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీపై కూడా గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు కెప్టెన్ కావాలనేది చిన్నప్పటి తన కల కాదని, దేశం తరఫున ఆడుతూ మ్యాచ్‌లు గెలిపించాలన్నదే తన కోరిక అని చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యత రావడంతో దాన్ని గౌరవంగా స్వీకరించానని తెలిపాడు.
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తనకు ముఖ్యమని గిల్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచినప్పుడు సంతోషంగా అనిపించిందని, అయితే ఇప్పుడు ర్యాంకింగ్స్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని చెప్పాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ జట్టును గెలిపించేందుకు తనవంతు కృషి చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు.