ఏపీ విద్యా సంస్కరణలకు సింగపూర్ ప్రశంసలు.. లోకేశ్‌కు షణ్ముగం కితాబు
- ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో సింగపూర్ హోం మంత్రి షణ్ముగం భేటీ
- రాష్ట్రంలో విద్యా సంస్కరణలను ప్రశంసించిన సింగపూర్ మంత్రి
- మాదకద్రవ్యాల నియంత్రణ, విద్యారంగంలో ఏపీకి సహకారం అందిస్తామని హామీ
- ఏపీ ఐటీఐలను సింగపూర్ ఐటీఈతో అనుసంధానించాలని నిర్ణయం
- డ్రాపౌట్లను సున్నా శాతానికి తగ్గించాలని షణ్ముగం సూచన
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వినూత్న సంస్కరణలను సింగపూర్ ప్రభుత్వం ప్రశంసించింది. రాష్ట్ర విద్యావ్యవస్థ బలోపేతానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్ హోం, న్యాయశాఖల మంత్రి కె. షణ్ముగం హామీ ఇచ్చారు. మంగళవారం తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ఆయన భేటీ అయ్యారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఇరువురు నేతలు రాష్ట్ర అభివృద్ధి, విద్యా సంస్కరణలు, మాదకద్రవ్యాల నివారణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, ముఖ్యంగా విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రభుత్వ పనితీరుతో పాటు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి షణ్ముగం ఈ సందర్భంగా అభినందించారు.
పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును సున్నా శాతానికి తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి షణ్ముగం సూచించారు. బడి మానేసే పిల్లలే భవిష్యత్తులో మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు సింగపూర్ తరహా కఠిన చట్టాలు అవసరమని అభిప్రాయపడుతూ, డ్రగ్స్ రహిత ఏపీ నిర్మాణానికి తమ సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న తీరును మంత్రి లోకేశ్ వివరించగా, ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా సందర్శించేందుకు మంత్రి షణ్ముగం ఆసక్తి వ్యక్తం చేశారు. అలాగే, యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ఏపీలోని ఐటీఐలను సింగపూర్‌కు చెందిన 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్' (ఐటీఈ)తో అనుసంధానించేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.