నాన్న డబ్బులిస్తేనే ఆ సినిమాలో నటిస్తానని చెప్పా: విక్టరీ వెంకటేశ్
Advertisement

నాన్న డబ్బులిస్తేనే ఆ సినిమాలో నటిస్తానని చెప్పా: విక్టరీ వెంకటేశ్

Venkatesh says I would act in that movie only if my father gave money
  • కొత్త సినిమా ప్రమోషన్లలో ఆసక్తికర విషయం చెప్పిన వెంకటేశ్
  • చిన్నప్పుడు నటనకు పారితోషికం అడిగానని వెల్లడి
  • 'ప్రేమ నగర్' చిత్రంలో నటించినందుకు తండ్రి రూ. 1000 ఇచ్చారని వెల్లడి
  • అక్టోబర్ 9న వెంకటేశ్ కొత్త చిత్రం 'ఆదర్శ కుటుంబం' విడుదల
టాలీవుడ్ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ తన చిన్ననాటి ఒక మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47'. ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సుమ, 'ప్రేమ నగర్' చిత్రంలో బాలనటుడిగా ఉన్నప్పటి ఫోటోను చూపించగా, వెంకటేశ్ ఆ నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. "ఒకరోజు నేను పాఠశాలలో ఆడుకుంటుండగా, మా ఫ్యామిలీ మేనేజర్ వచ్చి నాన్న (డి. రామానాయుడు) పిలుస్తున్నారని చెప్పారు. ఎందుకని ఆరా తీయగా, సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాలని తెలిపారు. అప్పట్లో మా నాన్న షూటింగ్ ముగిశాక జూనియర్ ఆర్టిస్టులకు పారితోషికం పంపిణీ చేయడం నాకు గుర్తుంది. దాంతో నేను కూడా, 'నాకు కూడా డబ్బులు ఇస్తారా?' అని అడిగాను" అని వెంకటేశ్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

మేనేజర్ ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పగా, ఆయన నాకు 1,000 రూపాయలను పారితోషికంగా ఇచ్చారని వెంకటేశ్ తెలిపారు. ఆ తర్వాతే 'ప్రేమ నగర్' సినిమాలో కైకాల సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో నటించానని ఆయన వివరించారు. వెంకటేశ్ పంచుకున్న ఈ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Venkatesh
Victory Venkatesh
Adarsha Kutumbam House No 47
Prema Nagar movie
Trivikram Srinivas

More Telugu News