రూ. 7000 కోట్ల దావా: నటి ఊర్వశి రౌతేలాకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు రిప్లై
- తన పేరు, ఫోటోలను వాడారంటూ ఏఐ కంపెనీపై ఊర్వశి లీగల్ యాక్షన్
- రూ. 7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు తెలిపిన నటి టీమ్
- ఆ మాటలు మేం నీతో బలవంతంగా పలికించలేదంటూ కౌంటర్ ఇచ్చిన ఏఐ కంపెనీ సీఈఓ
- ఏఐ, భవిష్యత్ వినోదంపై అవగాహన పెంచుకోవాలంటూ ఊర్వశీకి చురక
- బాలీవుడ్ భవిష్యత్తు ఏఐదేనని స్పష్టం చేసిన సీఈఓ షీరాజ్ హసన్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ మధ్య వివాదం ముదురుతోంది. తన పేరు, చిత్రాలు, వీడియోలను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఊర్వశి టీమ్ చేసిన ఆరోపణలపై బాలీవుడ్.ఏఐ, హాలీవుడ్.ఏఐ ఫౌండర్, సీఈఓ షీరాజ్ హసన్ తాజాగా స్పందించారు. ఊర్వశికి గట్టిగా కౌంటర్ ఇస్తూ, ఏఐ భవిష్యత్తుపై అవగాహన పెంచుకోవాలని సలహా ఇచ్చారు.
తాజాగా, ఊర్వశి టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా ఊర్వశి గుర్తింపును, కంటెంట్‌ను ఒక ఏఐ కంపెనీ వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుందని, దీని ద్వారా ఆ సంస్థ బిలియన్ల డాలర్ల విలువను సృష్టించిందని ఆరోపించింది. ఈ కారణంగా ఆ సంస్థపై రూ. 7,000 కోట్ల నష్టపరిహారం కోరుతూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. "మా అనుమతి లేకుండా ఊర్వశి పేరును మీ వ్యాపారానికి వాడుకోవద్దు" అని ఆ ప్రకటనలో హెచ్చరించింది.
అసలు, బాలీవుడ్.ఏఐ సంస్థకు ఊర్వశి ఇచ్చిన ఓ వైరల్ ఇంటర్వ్యూతో ఈ వివాదానికి బీజం పడింది. అందులో బాలీవుడ్, ఏఐ గురించి అడగ్గా.. "బాలీవుడ్? నా అభిప్రాయం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే.. నిజంగా.. అదీ.. దానితో బాలీవుడ్ బాధపడుతోంది. నాకు బాలీవుడ్ అంటే చాలా ఇష్టం" అంటూ ఆమె కాస్త తడబడుతూ సమాధానం ఇచ్చారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే షీరాజ్ హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశికి గట్టి సమాధానం ఇచ్చారు. "ఊర్వశి, ఆ మాటలు మేము నీతో బలవంతంగా ఏమీ పలికించలేదు. ఒక సమాధానం ఇచ్చే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, భవిష్యత్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారం గురించి తెలుసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను" అని ఆయన పోస్ట్ చేశారు.
అంతటితో ఆగకుండా, "బాలీవుడ్.ఏఐ, హాలీవుడ్.ఏఐ సంస్థలు వినోద పరిశ్రమ భవిష్యత్తు. ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్లు వయసు పెరగకుండా ఉంటారు, బహుళ భాషలు మాట్లాడగలరు, 24/7 పనిచేస్తారు, వారికి ఎలాంటి ఇగోలు ఉండవు. నువ్వు చెప్పిన సమాధానంతో పోరాడగలవేమో కానీ, రాబోయే భవిష్యత్తుతో పోరాడలేవు. దాన్ని స్వీకరించు" అంటూ బాలీవుడ్‌లో వినోద పరిశ్రమ పరిణామాన్ని అంగీకరించాలని ఆయన హితవు పలికారు. ఈ వ్యవహారంపై ఊర్వశి టీమ్ న్యాయపరంగా ముందుకు వెళ్తుండగా, షీరాజ్ హసన్ మాత్రం ఏఐ టెక్నాలజీనే భవిష్యత్తు అని గట్టిగా వాదిస్తున్నారు.