ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 35కే
Advertisement

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 35కే

AP Government Key Decision Onions at Rs 35 per kg in Rythu Bazars
  • ఉల్లి ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి
  • రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 35కే విక్రయం
  • మొదటి దశలో విజయవాడలో రేపటి నుంచి అమ్మకాలు
  • కుటుంబానికి నెలకు 2 కిలోల చొప్పున పంపిణీ
సామాన్యులకు ఊరటనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ. 35కే సబ్సిడీ ధరతో విక్రయించనున్నారు. తొలిదశలో భాగంగా రేపటి (సెప్టెంబర్ 30) నుంచి విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఈ విక్రయాల కోసం ఆధార్ లేదా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 2 కిలోల వరకు సబ్సిడీ ఉల్లిపాయలు అందజేస్తారు. సామాన్యులపై పెరుగుతున్న ఉల్లి ధరల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

విజయవాడలో లభించే స్పందన, డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్‌లో ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే వరకు ఈ సబ్సిడీ విక్రయాలను కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు.
Advertisement
Andhra Pradesh Government
Onion Prices
Rythu Bazar
Kinjarapu Atchannaidu
Nadendla Manohar

More Telugu News