సైబర్ స్టాకింగ్ పెరిగింది.. మహిళలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
- సాంకేతికత వాడకంతో సైబర్ స్టాకింగ్ పెరిగిందన్న ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
- ఆన్‌లైన్ వేధింపులకు గురైతే కుటుంబసభ్యులకు చెప్పాలని మహిళలకు సూచన
- హెల్ప్‌లైన్ నెంబర్లు 181, 112, 1930 గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి
టెక్నాలజీ వినియోగం పెరగడంతో భౌతిక వేధింపుల (ఫిజికల్ స్టాకింగ్) కంటే సైబర్ స్టాకింగ్ (ఆన్ లైన్ వేధింపులు) కేసులు ఎక్కువయ్యాయని, ఆన్‌లైన్ వేధింపుల పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన ‘స్టాకింగ్ నివారణ’ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా వేధించడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటివి పెరిగాయని శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నంబర్‌ను బ్లాక్ చేసినా కొత్త నంబర్ల నుంచి పదేపదే కాల్స్ లేదా మెసేజ్‌లు రావడం కూడా స్టాకింగ్ కిందకే వస్తుందని వివరించారు. అపరిచితుల నుంచి వచ్చే బహుమతులు, తమ ఫొటోలతో సృష్టించిన నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లు, వ్యక్తిగత ఫొటోల దుర్వినియోగంపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
వేధింపులకు గురైనప్పుడు సామాజిక అపవాదుకు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు లేదా కుటుంబసభ్యులకు తెలియజేయాలని శైలజ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో మహిళా పోలీసు అధికారిని కోరే హక్కు, జీరో ఎఫ్ఐఆర్ ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. వీటితో పాటు మానసిక ధైర్యం కూడా చాలా అవసరమన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 181 (మహిళా హెల్ప్‌లైన్), 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) నంబర్లను, శక్తి యాప్‌ను ఉపయోగించుకోవాలని ఆమె మహిళలకు సలహా ఇచ్చారు. ఇటీవల వైద్య విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి, కౌన్సెలింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు.