ఏఐ కంపెనీపై ఉర్వశి రౌతేలా ఫైర్.. రూ.7000 కోట్లకు దావా!
- తన గుర్తింపును వాడుకున్న ఏఐ కంపెనీపై నటి ఉర్వశీ రౌతేలా కేసు
- లాస్ ఏంజిల్స్ ఆధారిత సంస్థపై రూ.7000 కోట్ల నష్టపరిహారం డిమాండ్
- అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడారని ఆరోపణ
- ఏఐ దుర్వినియోగంపై ఇటీవల సల్మాన్ ఖాన్ ఆందోళన
ప్రముఖ నటి ఉర్వశి రౌతేలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు, చిత్రాలు, వీడియోలను అనుమతి లేకుండా వాడుకుందన్న ఆరోపణలపై లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఒక ఏఐ కంపెనీపై ఆమె బృందం న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు ఏకంగా రూ.7,000 కోట్ల భారీ నష్టపరిహారం కోరుతూ దావా వేసినట్లు ప్రకటించింది.
ఉర్వశి రౌతేలా టీమ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సదరు కంపెనీ ఆమె గుర్తింపును, కంటెంట్‌ను ఎలాంటి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంది. దీనిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నష్టాన్ని రూ.7,000 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఒక నటి పేరు, చిత్రం లేదా ఇతర వివరాలను వాణిజ్యపరంగా ఉపయోగించాలంటే కచ్చితంగా అధికారిక అనుమతి ఉండాలని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ఉర్వశి బృందం ప్రత్యేకంగా మాట్లాడుతూ, "ఉర్వశి పేరు, ఫోటోలు, వీడియోలను అనధికారికంగా ఉపయోగించుకుని ఆ సంస్థ బిలియన్ల డాలర్ల వ్యాపారం చేసిందని మా ఆరోపణ. అందుకే మేము లాస్ ఏంజిల్స్ కంపెనీపై రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. మీ ఏఐ కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోండి. కానీ అనుమతి లేకుండా ఉర్వశి పేరును మీ వ్యాపారం నుంచి దూరంగా ఉంచండి" అని తీవ్రంగా హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓ నోట్ ద్వారా పంచుకున్నారు.
ఇటీవల 'బిగ్ బాస్ 20' కార్యక్రమంలో నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. "ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు, వాయిస్ డబ్బింగ్‌లు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏఐ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది, కానీ అది చాలా భయానకంగా ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, దాన్ని ఏఐతో ఎడిట్ చేసి మరొకరిని తిట్టినట్లు సృష్టిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీల ఏఐ వీడియోలు చేస్తున్నారు. అందులో నేను కూడా బాధితుడినే" అని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉర్వశి రౌతేలా తీసుకున్న చర్య, ఏఐ దుర్వినియోగంపై జరుగుతున్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.