మేం ట్యాంపరింగ్ చేస్తే 400 సీట్లు వచ్చేవి: కాంగ్రెస్‌పై ఈటల ఫైర్
Advertisement

మేం ట్యాంపరింగ్ చేస్తే 400 సీట్లు వచ్చేవి: కాంగ్రెస్‌పై ఈటల ఫైర్

Eatala Rajender says BJP would have won 400 seats if they tampered EVMs
  • ఓట్ల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్
  • రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత పదవి నుంచి తొలగించాలని డిమాండ్
  • సోనియా గాంధీ ఓటుపై రాహుల్ సమాధానం చెప్పాలన్న అరవింద్
ఓట్ల ట్యాంపరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము ఓట్లను ట్యాంపరింగ్ చేసి ఉంటే లోక్‌సభలో 400 సీట్లు గెలిచేవాళ్లమని, కేవలం 240 సీట్లతో ఎందుకు సరిపెట్టుకుంటామని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని, భారత ప్రజాస్వామ్యాన్ని ఆయన నవ్వులపాలు చేస్తున్నారని మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

ఈవీఎంలను రాజీవ్ గాంధీ హయాంలోనే ప్రవేశపెట్టారని, వీవీప్యాట్‌లను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈటల గుర్తుచేశారు. ఇదే అంశంపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఉన్నంతవరకు 'కాంగ్రెస్ ముక్త్ భారత్' సాధ్యమేనని ఎద్దేవా చేశారు. "పౌరసత్వానికి ముందే సోనియా గాంధీకి ఓటు ఎలా వచ్చిందో రాహుల్ చెప్పాలని" ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో గెలవలేకే కాంగ్రెస్ పార్టీ లేనిపోని సమస్యలను సృష్టిస్తోందని అర్వింద్ ఆరోపించారు. దేశాన్ని, హిందువులను కించపరచడమే లక్ష్యంగా రాహుల్ పనిచేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Eatala Rajender
Dharmapuri Arvind
Rahul Gandhi
EVM Tampering Allegations
BJP vs Congress
Telangana BJP MPs

More Telugu News