వివేకా హత్య కేసులో లబ్ధిదారుడు జగనే: మంత్రి అనగాని సత్యప్రసాద్
- వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనేనన్న మంత్రి అనగాని
- ఈడీ, సీబీఐ విచారణతో భయపడే ధర్నాల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపణ
- డైవర్షన్ రాజకీయాలు మాని నిజాలు చెప్పాలని జగన్‌కు డిమాండ్
- ఉపాధ్యాయుడి మరణంపైనా వైసీపీ శవ రాజకీయం చేస్తోందని విమర్శ
- సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన, అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి జగనేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
"సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా నమ్మించి, సాక్ష్యాలను తుడిచిపెట్టిన చరిత్ర జగన్‌ది. ఇప్పుడు కూడా అదే తరహాలో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సునీల్ యాదవ్ వెల్లడించిన వాస్తవాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలన్నీ తాడేపల్లి నివాసం వైపే వేలెత్తి చూపిస్తున్నాయి" అని అనగాని పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతోనే డీఎస్సీ వంటి అంశాలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు.
అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయుడు కాకుమాను రాజశేఖర్‌ను ధర్నాకు బలవంతంగా పిలిపించి, ఆయన మృతికి కారకులయ్యారని, ఇప్పుడు ఆ మరణంపై కూడా శవ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెంచి పోషించిందని మండిపడ్డారు.
తప్పులు చేస్తూ ఇతరులపై ఎదురుదాడికి దిగడం వైసీపీకి అలవాటుగా మారిందని, ఆ పార్టీ తన పేరును 'గొడ్డలి డైవర్షన్ పార్టీ'గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ మీడియా ముందుకు వచ్చి వివేకా హత్యపై వాస్తవాలను వెల్లడించాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా తమ ప్రభుత్వం పరిష్కరించి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.