జుకర్‌బర్గ్ వేటలో దొరికిన ఇండియన్ టెక్ టాలెంట్.. ఎవరీ చిరంతన్ దేశాయ్?
- ఎంటర్‌ప్రైజ్ ఏఐ వ్యాపారం ప్రారంభించిన మెటా
- చిరంతన్ దేశాయ్‌కు కొత్త వ్యాపార బాధ్యతలు
- నేరుగా జుకర్‌బర్గ్‌కు రిపోర్ట్ చేయనున్న దేశాయ్
- దేశాయ్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం
- బెంగళూరులో పుట్టి పెరిగిన దేశాయ్
మెటా కొత్తగా చేపట్టిన ఎంటర్‌ప్రైజ్ ఏఐ వ్యాపారాన్ని నడిపించేందుకు మార్క్ జుకర్‌బర్గ్ ఓ భారతీయ మూలాలున్న టెక్ నిపుణుడిని ఎంపిక చేశారు. ఆయన పేరే చిరంతన్ “సీజే” దేశాయ్. కేవలం 11 నెలల క్రితమే మాంగోడీబీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దేశాయ్‌ను ఇప్పుడు మెటా తన కొత్త బిజినెస్ కోసం తీసుకుంది. ఆయన నేరుగా జుకర్‌బర్గ్‌కు రిపోర్ట్ చేయనున్నారంటే.. మెటాలో ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది.
మెటా కొత్తగా ప్రారంభించిన మెటా ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ వ్యాపారానికి దేశాయ్ చీఫ్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌పామ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. సంస్థలో ఇది తదుపరి ప్రధాన వ్యాపార విభాగంగా ఉంటుందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు. వ్యాపార సంస్థలు, డెవలపర్ల కోసం ఏఐ టూల్స్ అందించడమే ఈ కొత్త విభాగం లక్ష్యం. తన నియామకంపై దేశాయ్ కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు.
దేశాయ్‌కు ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్‌లు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఒరాకిల్, సిమాంటెక్, ఈఎంసీ, సర్వీస్‌నౌ, క్లౌడ్‌ఫ్లేర్, మాంగోడీబీ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. పెద్ద సంస్థల కోసం టెక్నాలజీ ఉత్పత్తులను రూపొందించడం, వ్యాపారాలను విస్తరించడంలో ఆయనకు అనుభవం ఉంది.
దేశాయ్ బెంగళూరులో పుట్టి పెరిగారు. 1993లో కుటుంబంతో అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-షాంపెయిన్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్, ఎంబీఏ పూర్తి చేశారు. 1995లో ఒరాకిల్‌తో కెరీర్ ప్రారంభించి, బెంగళూరులో ఆఫ్‌షోర్ వ్యాపారాలను నిర్మించడంలోనూ పనిచేశారు.
2016లో సర్వీస్‌నౌలో చీఫ్ ప్రొడక్ట్, ఇంజినీరింగ్ ఆఫీసర్‌గా చేరిన దేశాయ్ తర్వాత ప్రెసిడెంట్, సీఓఓ స్థాయికి ఎదిగారు. 2024 అక్టోబర్‌లో క్లౌడ్‌ఫ్లేర్‌కు, 2025 నవంబర్‌లో మాంగోడీబీకి సీఈఓగా వెళ్లారు. ఆయన మెటాలో చేరడంతో మాంగోడీబీ మాజీ సీఈఓ దేవ్ ఇట్టిచెరియా తాత్కాలిక సీఈఓగా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు.