ప్యారడైజ్‌లో కేసీఆర్‌ను పోలిన పాత్ర.. ట్రెండ్ అవుతున్న ప్రియదర్శి గెటప్, డైలాగ్స్
- ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ‘ది ప్యారడైజ్’
- ఎమ్మెల్యే శంకర్‌గా ప్రియదర్శి
- కేసీఆర్‌ను పోలిన పాత్ర అంటూ చర్చ
- హావభావాలపై నెటిజన్ల ప్రశంసలు
- తెలంగాణ యాసలో డైలాగ్‌లకు మంచి స్పందన
నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్రపై చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ రాజకీయ నాయకుడిని పోలిన గెటప్‌లో కనిపించినట్లు అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన హావభావాలు, మాటతీరు, తెలంగాణ యాస ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలినట్లు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రసంగాల్లో కనిపించే శైలి, బాడీ లాంగ్వేజ్‌ను గుర్తు చేసేలా ప్రియదర్శి నటన ఉందంటూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర ఎలా సాగుతుంది? ఎలాంటి సన్నివేశాల్లో కనిపిస్తారు? అన్నది తెరపై చూడాల్సిందే. అయితే సినిమా విడుదలైన వెంటనే ప్రియదర్శి పాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ యాసలో ప్రియదర్శి చెప్పిన డైలాగ్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తెలంగాణ యాసలో ఇరగదీశాడు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో నాని సినిమాతో పాటు ప్రియదర్శి పాత్ర కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్ర సైతం సినిమాలో ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విజయ్ కుమార్ నటించిన పాత్రలో ఆయన పోలికలు ఉన్నాయని అంటున్నారు.