'మనుషులను కాదు.. జంతువులను ప్రేమించండి'.. గోవిందా, కోమల్ రాణి వ్యవహారంపై సునీత పరోక్ష విమర్శలు?

'మనుషులను కాదు.. జంతువులను ప్రేమించండి'.. గోవిందా, కోమల్ రాణి వ్యవహారంపై సునీత పరోక్ష విమర్శలు?

Sunita Ahuja indirect criticism on Govinda and Komal Rani affair love animals not humans
  • సహనటి కోమల్ రాణితో కలిసి లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న గోవిందా
  • ఆ మరుసటి రోజే గోవిందా భార్య సునీత అహుజా సంచలన వ్యాఖ్యలు
  • మనుషుల కన్నా జంతువులే నయం అంటూ పరోక్ష విమర్శలు
  • ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా గోవిందాను ఉద్దేశించే అని ప్రచారం
  • గత కొంతకాలంగా గోవిందా, కోమల్ మధ్య సంబంధంపై వస్తున్న పుకార్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? అవుననే అంటున్నాయి ముంబై మీడియా వర్గాలు. తన సహనటి, రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి గోవిందా బహిరంగంగా కనిపించిన మరుసటి రోజే, సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మనుషుల నమ్మకంపై ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు నేరుగా గోవిందాను ఉద్దేశించే చేశారని ప్రచారం జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం సునీత అహుజా ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా గణేశ్‌ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, అదే రోజు సాయంత్రం గోవిందా తన సహనటి కోమల్ రాణితో కలిసి అదే మండపానికి వచ్చారు. తెలుపు కుర్తా-పైజామాలో గోవిందా, సంప్రదాయ దుస్తుల్లో కోమల్ రాణి కనిపించారు. ఇద్దరూ కలిసి స్వామివారికి పూజలు చేసి, హారతిలో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే, సునీత ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. తన పెంపుడు కుక్కను చేతిలో పట్టుకుని ఆమె మాట్లాడుతూ.. "మనుషులకు ఎంత ప్రేమ పంచినా ప్రయోజనం లేదు. వాళ్లు మోసమే చేస్తారు. అదే ఈ పెంపుడు జంతువులను చూడండి, ప్రేమ చూపిస్తే ఎప్పుడూ మనల్నే అంటిపెట్టుకుని ఉంటాయి. మనుషుల కన్నా జంతువులే ఎంతో నయం. మనుషులను కాదు, జంతువులను ప్రేమించండి. మనుషులు మోసగాళ్లు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సునీత తన వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, ఆమె మాట్లాడిన సమయం, సందర్భం చూస్తుంటే ఇవి గోవిందాను ఉద్దేశించే చేసినవని స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా గోవిందా, కోమల్ రాణి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి 'రూపా' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ కలిసి కనిపిస్తుండటం, ఇప్పుడు సునీత వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
Advertisement
Sunita Ahuja
Govinda
Komal Rani Swarnakar
Lalbaugcha Raja
Bollywood news
Love animals not humans

More Telugu News