గూగుల్ జెమినీ షాకింగ్ పని.. మూడు కంపెనీలను ‘హ్యాక్’ చేసిన ఏఐ!
- సైబర్ సెక్యూరిటీ పరీక్షలో జరిగిన ఘటన
- పాస్‌వర్డ్‌లు ఊహించి ఓ సిస్టమ్‌లోకి ప్రవేశించిన ఏఐ మోడల్
- పబ్లిక్ రిపాజిటరీల నుంచి లాగిన్ వివరాలు సేకరించిన వైనం
- నిజమైన కంపెనీలని గుర్తించిన తర్వాత ఆపేసినట్లు గూగుల్ వెల్లడి
- ఏఐ స్వయం ప్రతిపత్తిపై కొత్త ఆందోళనలు
సైబర్ సెక్యూరిటీ పరీక్షలో గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ సంచలనం సృష్టించింది. ఇంటర్నెట్ యాక్సెస్ పొందిన ఆ మోడల్.. పరీక్షలో భాగంగా మూడు నిజమైన కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబడింది. గూగుల్ ఏఐ స్వయంగా ఇలా వ్యవహరించిన తొలి ఘటనగా ఇది నమోదైనట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది.
ఈ ఘటన మే నెలలో జరిగింది. సైబర్ సెక్యూరిటీ పరీక్షలు నిర్వహించే స్వతంత్ర సంస్థ ఇర్రెగ్యులర్ ఈ పరీక్ష చేపట్టింది. జెమినీకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చి దాని సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను పరీక్షించారు. అయితే పరీక్షలో భాగంగా ఇచ్చిన లక్ష్యాలకు బదులుగా నిజమైన కంపెనీల సిస్టమ్స్‌లోకి అది ప్రవేశించింది.
ఓ సందర్భంలో జెమినీ పాస్‌వర్డ్‌లను ఊహిస్తూ పూర్తి సేఫ్టీ ఉన్న సిస్టమ్‌లోకి ప్రవేశించింది. మరో రెండు సందర్భాల్లో పబ్లిక్ రిపాజిటరీల్లో బయటపడి ఉన్న లాగిన్ వివరాలను గుర్తించింది. వాటి సాయంతో సేఫ్టీ ఉన్న సిస్టమ్స్‌లోకి వెళ్లింది.
అయితే నిజమైన కంపెనీల సిస్టమ్స్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించిన తర్వాత జెమినీ తన కార్యకలాపాలను ఆపేసిందని గూగుల్ తెలిపింది. ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ప్రభావిత కంపెనీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.
ఇర్రెగ్యులర్ ప్రతినిధి ప్రకారం.. ఇదే తరహా సమస్యలు ఇతర ఏఐ సంస్థల పరీక్షల్లోనూ కనిపించాయి. సంబంధిత సంస్థలకు జులై చివర్లో సమాచారం ఇచ్చారు. తమవైపు ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు ఇర్రెగ్యులర్ తెలిపింది. గతంలో మెటా, ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వ్యవస్థల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనలతో ఏఐకి ఇంటర్నెట్, కంప్యూటర్ సిస్టమ్స్‌కు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏఐ ఏ స్థాయిలో స్వతంత్రంగా చర్యలు తీసుకోగలదన్న అంశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.