ఆసియా గేమ్స్‌లో మరోసారి అదే సీన్? నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా?
- ఆసియా క్రీడల్లో మరోసారి నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకోవాల్సిన పరిస్థితి
- దీనిపై ఇప్పుడే ఏమీ ఆలోచించలేదన్న బీసీసీఐ
- ప్రస్తుతం తమ దృష్టి అంతా ఆట గెలవడంపైనే ఉందని స్పష్టీకరణ
- నిబంధనల ప్రకారం పతకాలు అందించే బాధ్యత ఓసీఏ అధ్యక్షుడిది
- ఆయన ఆ బాధ్యతలు అప్పగిస్తే నఖ్వీ అందించాల్సి రావొచ్చని సమాచారం
ఆసియా కప్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసియా గేమ్స్‌లోనూ ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. 2026 ఐచి-నాగోయా ఆసియా గేమ్స్‌లో భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు పతకాలు గెలిస్తే.. నఖ్వీ చేతుల మీదుగా వాటిని స్వీకరిస్తారా? అనే అంశంపై బీసీసీఐ స్పందించింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టి పూర్తిగా మ్యాచ్‌లపైనే ఉందని చెప్పారు. ముందుగా జట్లు పతకాలు గెలిచే స్థాయికి చేరుకోవాలని, ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడే జరగని విషయంపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆసియా గేమ్స్‌లో పతకాలను ఎవరు అందించాలన్నది ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు. ఓసీఏ అధ్యక్షుడు షేక్ జోయాన్ బిన్ హమద్ అల్ థానీ.. పతకాలు అందించే బాధ్యతను మరొక సభ్యుడికి అప్పగించవచ్చు.
నఖ్వీకి ఓసీఏ నుంచి అధికారికంగా ఆ బాధ్యత అప్పగిస్తే భారత క్రీడాకారులు పతకాలు స్వీకరించాల్సి ఉంటుందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. అలా చేయకపోతే ఆసియా గేమ్స్, ఓసీఏను అవమానించినట్లుగా పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. క్రమశిక్షణ చర్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఓసీఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 66లో విజయోత్సవ కార్యక్రమాలపై నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా విజేతలకు ఓసీఏ అధ్యక్షుడే పతకాలు అందిస్తారు. అవసరమైతే ఆ బాధ్యతను ఇతర ఓసీఏ సభ్యులకు అప్పగించవచ్చు. పతకాల ప్రదానోత్సవంలో రాజకీయ, మత, వాణిజ్య లేదా జాతి పరమైన ప్రచారాలకు అనుమతి లేదని నిబంధనలు చెబుతున్నాయి.