యూపీఐ ఛార్జీలపై పేటీఎం సీఈఓ కీలక వ్యాఖ్యలు
- రూ. 2000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ప్రతిపాదన
- నిర్ణయాన్ని స్వాగతించిన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ
- ఇదో రాబిన్ హుడ్ విధానమని వ్యాఖ్య
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపు ఆందోళనలపై పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2,000 మించిన నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధించాలన్న ఎన్‌పీసీఐ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇది 'రాబిన్ హుడ్' తరహా విధానమని, దీనివల్ల సామాన్య వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
పెద్ద ఇ-కామర్స్ సంస్థలు, రిటైల్ చైన్‌ల వంటి భారీ వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని, చిన్న వ్యాపారులకు, సాధారణ ప్రజలకు యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగించేందుకు వినియోగించవచ్చని శర్మ వివరించారు. ఇతర చెల్లింపు విధానాలకు ఇప్పటికే ఛార్జీలు వర్తిస్తున్నాయని, ఇప్పటివరకు యూపీఐ వ్యవస్థ ప్రధానంగా ప్రభుత్వ మద్దతుతోనే కొనసాగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కొత్త నిర్ణయం యూపీఐ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేలా ఉండటం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం స్టాక్ మార్కెట్లో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో ఇవి 7.24% పెరిగి, రూ. 1,856.50 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. పేటీఎం బాటలోనే మొబిక్విక్, పైన్‌ల్యాబ్స్ వంటి ఇతర ఫిన్‌టెక్ కంపెనీల షేర్లలో కూడా సానుకూల ధోరణి కనిపించింది.