ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

Chandrababu Naidu serious on private coaching centers orders strict action
  • ప్రభుత్వంపై బురద జల్లేందుకు అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయని కోచింగ్ సెంటర్లపై ఆరోపణ
  • రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రభుత్వ నిర్ధారణ
  • జీవో నెం.9 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వెల్లడి
  • రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించేది లేదని స్పష్టీకరణ
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో విద్యార్థులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చట్టప్రకారం ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.

కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాల యాజమాన్యాలు తమ స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోటీ పరీక్షల కోసం తమ వద్ద శిక్షణ పొందుతున్న యువతపై ఒత్తిడి తెచ్చి, వారిని రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ధర్నాలలో పాల్గొనేలా చేస్తున్నట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే అభ్యర్థులను ఈ ఆందోళనల వైపు మళ్లిస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు.

వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు 2026, జీవో నెంబర్ 9 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి కొన్ని సంస్థలు రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, అభ్యర్థులను రాజకీయ కుట్రల్లోకి లాగాలని చూస్తే కఠిన పరిణామాలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ కోచింగ్ సెంటర్‌పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదని స్పష్టం చేసింది.
Advertisement
Chandrababu Naidu
Private Coaching Centers
Andhra Pradesh Government
Student Protests
Coaching Center Regulations
Competitive Exam Aspirants

More Telugu News