యూపీఐపై ఛార్జీలు విధిస్తే భారత్‌లో మళ్లీ క్యాష్ వినియోగం పెరుగుతుంది: అష్నీర్ గ్రోవర్
- యూపీఐపై ఛార్జీలను వ్యతిరేకించిన అష్నీర్ గ్రోవర్
- ఛార్జీలు విధిస్తే ప్రజలు నగదు వైపు మళ్లే అవకాశం ఉందని వ్యాఖ్య
- రూ.2,000 దాటిన లావాదేవీలపై స్పష్టత లేదని వెల్లడి
- యూపీఐ లావాదేవీల విలువలో 66 శాతం పెద్ద ట్రాన్సాక్షన్సే ఉన్నాయని వెల్లడి
- ఎండీఆర్ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపొచ్చని అంచనా
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే ఆలోచనపై 'భారత్‌పే' సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఐ సేవలకు రుసుము వసూలు చేస్తే అది పరోక్షంగా పన్ను విధించినట్లేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తున్న వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వస్తే ప్రజలు, వ్యాపారులు మళ్లీ నగదు వైపు మళ్లే అవకాశం ఉందని గ్రోవర్ హెచ్చరించారు. దీనివల్ల బ్యాంకులు, వ్యాపార సంస్థలకు నగదు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని చెప్పారు. చివరికి భారత్ మళ్లీ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారే పరిస్థితి రావచ్చన్నారు.
ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, చెల్లింపు సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. రూపే డెబిట్ కార్డు చెల్లింపులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై, ముఖ్యంగా వ్యాపారుల చెల్లింపుల విషయంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందా అన్నది నోటిఫికేషన్‌లో స్పష్టంగా లేదు.
ప్రస్తుతం లావాదేవీ విలువతో సంబంధం లేకుండా యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదు. అయితే రూ.2,000 పరిమితి ఎందుకు పెట్టారన్నదే తన ప్రశ్న అని గ్రోవర్ అన్నారు. రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీలు మొత్తం లావాదేవీల్లో పరిమాణం పరంగా కేవలం 4 శాతమే అయినా.. మొత్తం విలువలో వాటి వాటా 66 శాతంగా ఉందని పేర్కొన్నారు.
పెద్ద మొత్తాల యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ విధిస్తే ఆ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపే అవకాశం ఉందని గ్రోవర్ చెప్పారు. లేదంటే ఒకేసారి రూ.12,000 చెల్లించాల్సిన చోట రూ.2,000 చొప్పున పలుమార్లు చెల్లించే పరిస్థితి రావచ్చన్నారు.
అదే సమయంలో దుకాణదారులు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులను స్వీకరించకుండా నగదు అడిగే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు నగదు అవసరం పెరుగుతుంది. మరిన్ని ఏటీఎంలు, నగదు నిర్వహణ కేంద్రాలు అవసరమవుతాయని తెలిపారు.
యూపీఐపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వల్ల అసలు ఎవరికి నష్టం జరుగుతోందో చెప్పాలని గ్రోవర్ ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్ల మిగులు బదిలీ జరిగిందని, లిస్టెడ్ బ్యాంకుల మొత్తం లాభాలు రూ.4.11 లక్షల కోట్లుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్‌పీసీఐ ప్రీ-ట్యాక్స్ మిగులు కూడా రూ.1,888 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.