రణబాలిలో రష్మిక పాత్రపై ఆసక్తికర విషయం చెప్పిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్..!
- రష్మిక పాత్రకు తన తల్లి పేరు పెట్టినట్లు తెలిపిన రాహుల్
- సినిమాలో జయమ్మగా కనిపించనున్న రష్మిక
- అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానున్న రణబాలి
- జయమ్మ పాత్రను స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దినట్లు చెప్పిన దర్శకుడు
- విజయ్-రష్మిక జంటగా ఇది మూడో సినిమా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాలో రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రకు తన తల్లి పేరే పెట్టినట్లు తెలిపారు.
రష్మిక తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘రణబాలి’ కథ రాస్తున్న సమయంలో ఆ కాలానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తన జ్ఞాపకాలతో ముడిపెట్టుకున్నానని చెప్పారు. కథానాయిక పాత్రను రాసేటప్పుడు కూడా తన తల్లినే గుర్తు చేసుకున్నానని తెలిపారు.
జయమ్మ పాత్రలో ప్రతి భావోద్వేగాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లు రాహుల్ చెప్పారు. కథ 19వ శతాబ్దంలో సాగినా.. నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఆమె పాత్రను రూపొందించినట్లు వివరించారు.
సినిమాలో జయమ్మ పాత్రకు ఆ కాలం నాటి పట్టు, కాటన్ చీరలు, జరీ, పాతకాలపు రంగులు, నగల వంటివి ప్రత్యేకంగా ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. రణబాలి జీవితంలో ఆమె ప్రేమ, స్ఫూర్తి.. అతడి బలంలో భాగమని పేర్కొన్నారు.
రష్మిక జయమ్మ పాత్రకు ప్రాణం పోశారని రాహుల్ ప్రశంసించారు. ఆమె నటనతో ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. అక్టోబరు 16న ప్రేక్షకులు జయమ్మను తెరపై చూడబోతున్నారని తెలిపారు.
‘రణబాలి’లో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక ఆయన భార్య జయమ్మగా నటిస్తున్నారు. ‘ది మమ్మీ’ చిత్రంతో గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టర్‌గా కనిపించనున్నారు.
బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 19వ శతాబ్దానికి చెందిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన చారిత్రక పరిణామాలను కథలో చూపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సమర్పిస్తోంది. తొలుత సెప్టెంబరు 11న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా అక్టోబరు 16కు వాయిదా వేశారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇది.