16 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్
- ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ రికార్డు
- ఫైనల్‌లో జపాన్ ఆర్చర్‌పై షూటౌట్‌లో ఉత్కంఠభరిత విజయం
- పురుషుల విభాగంలో 16 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
- 2007లో డోలా బెనర్జీ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన రెండో భారతీయుడిగా రికార్డ్
- మూడో ప్రయత్నంలో టైటిల్‌ను కైవసం చేసుకున్న ధీరజ్ బొమ్మదేవర
భారత ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత పురుష ఆర్చర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెక్సికోలోని సాల్టిలో జరిగిన ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నకానిషి జున్యాపై షూటౌట్‌లో 6-5 తేడాతో ఉత్కంఠ విజయం సాధించాడు.
హోరాహోరీగా సాగిన ఈ తుదిపోరులో ఇరువురు ఆర్చర్లు 5 సెట్ల తర్వాత 5-5తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్‌లో ధీరజ్ పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించాడు. ఒత్తిడిలో నకానిషి కేవలం 9 పాయింట్లు మాత్రమే కొట్టడంతో ధీరజ్ చారిత్రక స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.
16 ఏళ్ల క్రితం 2010లో జయంత తాలుక్‌దార్ పురుషుల రికర్వ్ విభాగంలో కాంస్యం గెలిచిన తర్వాత, ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి భారత పురుషుడు ధీరజే. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ తరఫున స్వర్ణం గెలిచిన ఏకైక క్రీడాకారిణి డోలా బెనర్జీ (2007). మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ ఘనత మళ్లీ సాధించిన రెండో ఇండియన్‌గా ధీరజ్ నిలిచాడు.
25 ఏళ్ల ఆర్మీ ఆర్చర్ అయిన ధీరజ్‌కు ఇది మూడో వరల్డ్ కప్ ఫైనల్. గత రెండుసార్లు (2023, 2024) పతకం లేకుండానే వెనుదిరిగిన అతడు, ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుని భారత పురుషుల ఆర్చరీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.