ఏకంగా సెక్రటేరియట్‌లోనే లంచం.. ఏసీబీ చేతికి చిక్కిన ఉద్యోగి
- సచివాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
- సీఎంఆర్‌ఎఫ్ చెక్కు కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
- బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ అధికారులు
- సచివాలయ దేవాలయం వద్ద డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
- లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
తెలంగాణ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) సెక్షన్‌లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు ఇచ్చేందుకు బాధితుడి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు కోసం లంచం అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. గురువారం సచివాలయ ప్రాంగణంలో నిఘా ఏర్పాటు చేశారు.
సచివాలయంలోని దేవాలయం వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.లక్ష లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత సీఎంఆర్‌ఎఫ్ సెక్షన్‌లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేయడం వెనుక మరికొందరి పాత్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో రెగ్యులర్ అధికారుల ప్రమేయం ఉందా? అన్నదీ ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.