ఉద్యోగులకు ఉబర్ కొత్త నిబంధన.. మారిన వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్
- ఉబర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కఠినతరం
- వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు ఆదేశం
- ఇటీవల 3,300 మందిని తొలగించిన కంపెనీ
- పూర్తి రిమోట్ వర్క్‌కు కేవలం 1 శాతం మందికే అనుమతి
- ఈ నిబంధనలు డ్రైవర్లకు వర్తించవని స్పష్టం
ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం 'ఉబర్', తన కార్పొరేట్ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు పాటు కార్యాలయం నుంచే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అధికారిక సమాచారం అందించారు.
ప్రస్తుతం రిమోట్‌గా పని చేస్తున్న వారు సైతం తమ బృందాలతో కలిసి పనిచేసేందుకు వీలుగా, కార్యాలయాలు ఉన్న ప్రాంతాలకు మారాలని ఆయన సూచించారు. మొత్తం ఉద్యోగుల్లో కేవలం ఒక శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ చేసేందుకు అనుమతి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. మేనేజర్లు, వారి బృందాలు ఒకే చోట ఉండి పని చేయాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని, ఇందుకోసం న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఇటీవల ఊబర్ తన ప్రపంచవ్యాప్త సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని, అంటే దాదాపు 3,300 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన విషయం విదితమే. భారీగా ఉద్యోగాల కోత విధించిన అనంతరం కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అనవసరమైన మేనేజ్‌మెంట్ విభాగాలను తగ్గించడంతో పాటు పెట్టుబడులు సమీక్షలో భాగంగానే ఈ మార్పులు చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ నూతన నిబంధనలు కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని, డ్రైవర్లు లేదా ఇతర ఆపరేషనల్ సిబ్బందిపై వీటి ప్రభావం ఉండదని ఊబర్ స్పష్టం చేసింది.