పదేళ్ల నిరీక్షణకు తెర.. నేడు మార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. ధరలో సరికొత్త రికార్డ్!
- పదేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకువస్తున్న యాపిల్
- సుమారు 2000 డాలర్ల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం
- ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద డిజైన్ మార్పుగా భావిస్తున్న టెక్ నిపుణులు
- 7.8 అంగుళాల భారీ స్క్రీన్‌తో రానున్న కొత్త మోడల్
- నేడు లాంచ్.. తొలి ఏడాదే కోటి యూనిట్ల అమ్మకాల అంచనా
టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. సుమారు పదేళ్ల పాటు సాగిన పరిశోధన, అభివృద్ధి తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక పరికరాన్ని నేడు మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఐఫోన్ చరిత్రలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇదే అతిపెద్ద డిజైన్ మార్పు కానుండగా, దీని ప్రారంభ ధర సుమారు 2,000 డాలర్లు (దాదాపు రూ. 1.89 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తెలిసిన వారి ప్రకారం.. శాంసంగ్ తన మొదటి గెలాక్సీ ఫోల్డ్‌ను 2019లో విడుదల చేయడానికి చాలా సంవత్సరాల ముందే యాపిల్ ఇంజినీరింగ్ బృందాలు ఫోల్డబుల్ ఫోన్లు, డిస్‌ప్లేలపై పరిశోధనలు ప్రారంభించాయి.
అయితే, 2020లో అప్పటి సీఈఓ టిమ్ కుక్ ఆసియా పర్యటన తర్వాత ఈ ప్రాజెక్ట్ వేగం పుంజుకుంది. శాంసంగ్, హువావే వంటి కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను గమనించిన ఆయన, ఫోల్డబుల్ ఐప్యాడ్ మినీ కాన్సెప్ట్‌ను పక్కనపెట్టి, ఫోల్డబుల్ ఐఫోన్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు.
అంతర్గతంగా ‘వీ68’గా, అభివృద్ధి దశలో ‘ఐఫోన్ అల్ట్రా’గా పిలుచుకున్న ఈ ప్రాజెక్టులో ఆపిల్ అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా స్క్రీన్ మధ్యలో కనిపించే మడత (crease)ను తగ్గించడం, హింజ్ (hinge) మన్నికను పెంచడం, కార్నింగ్ సంస్థ భాగస్వామ్యంతో ఫ్లెక్సిబుల్ కవర్ గ్లాస్‌ను అభివృద్ధి చేయడం, అండర్-డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీని మెరుగుపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. చివరికి టైటానియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసిన హింజ్‌తో పాటు ఇతర ఆండ్రాయిడ్ ఫోల్డబుల్స్ కన్నా వెడల్పైన 7.8 అంగుళాల లోపలి డిస్‌ప్లే, కాంపాక్ట్‌గా ఉండే 5.5 అంగుళాల బయటి స్క్రీన్‌తో తుది డిజైన్‌ను ఖరారు చేశారు.
ధర నిర్ణయంపై సంస్థ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. మొదట ఐఫోన్ ఎక్స్ తరహాలోనే 2,000 డాలర్ల లోపు, అంటే 1,999 డాలర్ల ధరను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, మెమరీ కొరత వంటి కారణాలతో ఇటీవలి చర్చల్లో ప్రారంభ ధర 2,199 డాలర్లకు పెరిగినట్లు సమాచారం. అధిక స్టోరేజ్ వేరియంట్ల ధర 3,000 డాలర్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శాంసంగ్, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్లు 1,899 డాలర్ల ప్రారంభ ధరతో లభిస్తున్నాయి.
యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ సారథ్యంలో విడుదల కాబోతున్న ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణ ఐఫోన్లతో పోలిస్తే మన్నిక, కెమెరా పనితీరు, బ్యాటరీ లైఫ్ వంటి విషయాల్లో కొన్ని రాజీలు ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, తొలి సంవత్సరంలోనే 70 లక్షల నుంచి కోటి యూనిట్ల వరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉత్పత్తితో భవిష్యత్తులో మరిన్ని వినూత్న హార్డ్‌వేర్ ఉత్పత్తులకు యాపిల్ నాంది పలుకుతోందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.