నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. బిజీబిజీగా షెడ్యూల్
- పి.గన్నవరం నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
- రైతులతో సమావేశమై, గ్రామసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- సాయంత్రం నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ప్రత్యేకంగా భేటీ
- రాత్రికి తిరిగి అమరావతికి పయనం కానున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పర్యటించి, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 09:45 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10:30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:55 గంటలకు మాచవరం గ్రామానికి వెళ్లి రైతులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా అందజేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 01:55 గంటలకు పండువారిపేటలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం 03:15 గంటలకు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 05:40 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.