ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ గడువు పొడిగింపు
- రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కు సెప్టెంబర్ 30 వరకు సమయం
- బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్న కమిషన్
- గ్రామీణ, పట్టణ సంస్థల్లో ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ కమిషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీల) సామాజిక, రాజకీయ వెనుకబాటుతనంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక సమర్పించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, నిర్దేశిత గడువులోగా నివేదిక సిద్ధం కాకపోవడంతో కమిషన్ పదవీ కాలాన్ని ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. తాజాగా మరోసారి గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ సమర్పించే నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, కమిషన్ తన నివేదికను సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.