ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్.. వెంటనే రాజీనామా చేయాలి: రేవంత్‌రెడ్డి
- ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందన్న రేవంత్‌రెడ్డి
- వెయ్యి రోజులుగా జీతభత్యాలు తీసుకుంటూ కేసీఆర్ బయటకు రాలేదని విమర్శ
- ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
- మూసారాంబాగ్‌లో హైలెవల్ వంతెనను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- కేసీఆర్ రాజీనామా కోరుతూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
తెలంగాణలో ప్రభుత్వం కాకుండా, ప్రతిపక్షమే తన పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారని, అందుకే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వద్ద రూ.52 కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెనను ప్రారంభించిన అనంతరం అంబర్‌పేటలో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు.
గత వెయ్యి రోజులుగా కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం, ఇతర సదుపాయాల రూపంలో రూ.22 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తీసుకున్నారని, కానీ ఒక్కరోజు కూడా ప్రజల కోసం బయటకు రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "ప్రజల సొమ్మును పందికొక్కులా మెక్కి ఫాంహౌస్‌లో పడుకుంటే సరిపోతుందా? వెయ్యి రోజులు ముఖం చాటేసిన ప్రతిపక్ష నేత దేశంలో ఎవరైనా ఉన్నారా?" అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తాను ఈ వెయ్యి రోజుల్లో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని, కేసీఆర్ మాత్రం ఒక్క గంట కూడా ప్రజలకు సమయం కేటాయించలేదని అన్నారు.
వెయ్యి రోజులుగా ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. 7వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. తాను కుటుంబ సభ్యులకు కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇచ్చానని, కేసీఆర్ మాత్రం తన కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని విమర్శించారు.
ఈ సందర్భంగా అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలను ఆవిష్కరించారు. వ్యవస్థను గాడిన పెట్టామని, ఇకపై పాలన సాఫీగా సాగుతుందని ప్రజలకు రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.