ఏపీలో కీలక రహదారికి కేంద్రం నిధులు మంజూరు.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
- ఎన్డీఏ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి అన్న సీఎం చంద్రబాబు
- ఏపీలో జాతీయ రహదారికి రూ. 840 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి
- పోలవరం, గోదావరి ఘాట్లకు మెరుగుపడనున్న కనెక్టివిటీ
- రైతులు, భక్తులకు లబ్ధి చేకూరుస్తుందని హర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలకమైన జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని అందిస్తోందని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి-365BB విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.840.41 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కేంద్రమంత్రి గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పొగాకు, చెరకు, పామాయిల్, ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలు కలుగుతుందని అన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా బుట్టాయిగూడెం–ఎల్ఎన్‌డీ పేట, పత్తిసీమ–కొవ్వూరు మధ్య 45.09 కిలోమీటర్ల మేర రహదారిని పేవ్డ్ షోల్డర్స్‌తో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రహదారి అభివృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రహదారి నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు.
కేంద్రమంత్రి గడ్కరీ తన ప్రకటనలో, ఈ రహదారి విస్తరణతో పోలవరం ప్రాజెక్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయపరంగా కీలకమైన ఈ ప్రాంతంలో ఉత్పత్తుల రవాణా వేగవంతం కావడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా, గోదావరి నది వెంబడి ఉన్న పుణ్యక్షేత్రాలకు, స్నానఘట్టాలకు భక్తులు సులభంగా చేరుకునేందుకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో వ్యవసాయం, పర్యాటకం, వాణిజ్యం, తీర్థయాత్రలతో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు అవుతుందని కేంద్రం భావిస్తోంది.