స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి 'మివి'.. సెప్టెంబర్‌లో తొలి ఫోన్ లాంచ్!

Mivi enters smartphone market first phone launch in September
  • సెప్టెంబర్‌లో తొలి మోడల్ విడుదలయ్యే అవకాశం
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే టీజర్ విడుదల చేసిన సంస్థ
  • కీలక అధికారిగా హిమాంశు టాండన్‌ను నియమించుకున్న మివి
  • బడ్జెట్ ధరల్లో ఫోన్లు తీసుకురానున్న వేరబుల్ బ్రాండ్లు
ఇప్పటివరకు ఆడియో ఉత్పత్తులు, వేరబుల్స్‌తో దేశీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'మివి' (Mivi) సంస్థ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతోంది. 2026 సెప్టెంబర్‌లో తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఫ్లిప్‌కార్ట్‌లో దర్శనమిచ్చిన ఈ టీజర్ పోస్టర్‌ను ధృవీకరిస్తూ 'మివి' తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నూతన ప్రయాణంలో భాగంగా, పోకో, నథింగ్ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన అనుభవజ్ఞుడైన హిమాంశు టాండన్‌ను చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నియమించుకుంది. లీకైన వివరాల ప్రకారం, ఈ ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానల్, గుండ్రని అంచులతో ప్రాథమికంగా గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, బడ్జెట్ ధరల్లో ఫోన్లను అందించి వినియోగదారులకు చేరువ కావాలని 'మివి' లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మరో వేరబుల్ బ్రాండ్ ఫైర్‌బోల్ట్ కూడా 'బోల్ట్' పేరుతో ఆగస్టు 25న స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి బ్రాండ్ల తరహాలో ఇప్పుడు లావా, వంటి సంస్థలతో పాటు మివి కూడా ఈ జాబితాలో చేరనుంది.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 'మివి', 'మేక్ ఇన్ ఇండియా' విధానంలో ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY25) రూ.300 కోట్లకు పైగా ఆదాయాన్ని నమోదు చేసింది. త్వరలోనే ఈ ఫోన్ పేరు, పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించనుంది.
Advertisement
Mivi
Mivi Smartphone Launch
Himanshu Tandon
Budget Smartphones India
Make in India Mobiles

More Telugu News