పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌పై కీలక ప్రకటన.. ఉచితం ఎప్పటివరకు అంటే..!

UIDAI key announcement on children Aadhaar biometric free until September 30
  • పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక ప్రకటన
  • సెప్టెంబర్ 30 వరకు ఈ సేవలు పూర్తిగా ఉచితం
  • 5, 15 ఏళ్లు నిండిన పిల్లలకు బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి
  • పాఠశాల అడ్మిషన్లు, ప్రభుత్వ పథకాలకు ఇది చాలా అవసరం
  • వెంటనే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలని తల్లిదండ్రులకు సూచన
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

పిల్లలకు 5 సంవత్సరాలు, ఆ తర్వాత 15 సంవత్సరాలు నిండినప్పుడు వారి బయోమెట్రిక్‌ వివరాలను (వేలిముద్రలు, కనుపాప) తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. వయస పెరిగే కొద్దీ పిల్లల బయోమెట్రిక్స్‌లో మార్పులు వస్తాయి కాబట్టి, ఆధార్ రికార్డుల కచ్చితత్వం కోసం ఈ అప్‌డేట్ అనివార్యం. పాఠశాల ప్రవేశాలు, పరీక్షలు, ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు), ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం వారి ఫోటో, చిరునామా వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో వారి వేలిముద్రలు పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి బయోమెట్రిక్స్‌ను తీసుకోరు. కావున, ఆ పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత రెండోసారి బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. వాస్తవానికి, 2025 అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ సేవను యూఐడీఏఐ ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం ఆ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రాలను సంప్రదించాలని యూఐడీఏఐ తల్లిదండ్రులకు సూచించింది.
Advertisement
UIDAI
Aadhaar Biometric Update
Children Aadhaar Update
Free Aadhaar Update Deadline
Aadhaar Card Biometrics

More Telugu News