75 లక్షల ఇళ్ల మైలురాయి దాటిన 'ఇంటింటికీ టీడీపీ'.. భారీగా ప్రజా స్పందన
- ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి
- 27 రోజుల్లో 76.87 లక్షల కుటుంబాలను కలిసిన టీడీపీ శ్రేణులు
- కూటమి ప్రభుత్వ పథకాలపై ప్రచారం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ
- కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్న పార్టీ
- శనివారం ఒక్కరోజే 2.57 లక్షల ఇళ్లను సందర్శించిన నేతలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. శనివారంతో 27వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు పార్టీ శ్రేణులు 75 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలిసి, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాయి.
శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,57,000 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 76.87 లక్షల ఇళ్లను సందర్శించినట్లయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో, పార్టీ నేతలు ప్రతి గడపకూ వెళుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి వర్గాలకు అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలియజేస్తూ, వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆధారంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, టీడీపీ శ్రేణుల్లో ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమవుతూ తమ అభిప్రాయాలను నేరుగా పంచుకుంటున్నట్లు పేర్కొన్నాయి.