సంస్కరణలు పూర్తయ్యాయి.. ఇక 100 శాతం ఫలితాలే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
- విజయనగరం దాసన్నపేటలో క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
- హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- ప్రతినెలా క్లస్టర్ స్కూల్ సమావేశాలకు హాజరవుతానని మంత్రి హామీ
- ఈ ఏడాది మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం
- నైతిక విలువల పెంపునకు ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించామని వెల్లడి
- ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలోనే నంబర్ వన్ గా నిలుపుతామని ప్రకటన
రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల శకం పూర్తయిందని, ఇకపై నూరు శాతం ఫలితాలు సాధించడమే అందరి లక్ష్యం కావాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయనగరం దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇప్పుడు పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
గత ఏడాది సంస్కరణల ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫలితాలతో సంతృప్తిగా లేరని, నూరు శాతం ఫలితాలనే ఆశిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా ఒక క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా వినూత్న పద్ధతుల్లో మెళకువలు నేర్పాలని సూచించారు.
యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో వలస కుటుంబాలను, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను చూసి చలించిపోయానని, అప్పుడే విద్యారంగంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించుకున్నానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖ ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను నమ్ముతానని పేర్కొన్నారు.
విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్ వన్ టీచర్' విధానం తెచ్చామని, డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఈ ఏడాది మరో డీఎస్సీ ద్వారా అదనంగా 3 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా ప్రకటించడం, ఉత్తమ ఉపాధ్యాయులను శిక్షణ కోసం సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపడం వంటివి చేపట్టామన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఆలోచనా విధానం కూడా మారుతోందని, వారిని అర్థం చేసుకుని బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ నేపథ్యంలో నైతిక విలువల ఆవశ్యకతను గుర్తించి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించినట్లు తెలిపారు.
ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని పూర్తిగా తగ్గించామని, వారికి అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అత్యుత్తమ విద్యావిధానాన్ని రూపొందించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరక్టర్ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.