'ఇరుముడి' ఫస్టు డే కలెక్షన్స్ ఇవే!

Irumudi Movie Update
  • రవితేజ హీరోగా వచ్చిన 'ఇరుముడి'
  • మొదటి ఆటతోనే దక్కిన హిట్ టాక్ 
  • తొలిరోజునే 24 కోట్లకి పైగా వసూళ్లు
  • హైలైట్ గా నిలిచే తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఇరుముడి' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించడం .. ఈ సినిమా నుంచి సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. దాంతో ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ కనిపించని సందడి ఈ వారం కనిపించింది. ఆన్ లైన్ లో చకచకా టికెట్స్ అమ్ముడయ్యాయి. 

నిజానికి రవితేజ మినహా మిగతా ఆర్టిస్టులంతా ఓ మాదిరి క్రేజ్ ఉన్నవారే. ఇక రవితేజతో పాటు తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన పాప 'నక్షత్ర' కూడా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా మంచి బజ్ ను సంపాదించుకుంది. రవితేజ క్రేజ్ .. 'ఇరుముడి' అనే టైటిల్ .. ట్రైలర్ .. సాంగ్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా, విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

అయ్యప్పస్వామి వైపు నుంచి ఉన్న డివోషనల్ టచ్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కథానాయకుడు కావడం .. కూతురుపై అతనికి గల ప్రేమ .. తాను ఉన్నానంటూ కూతురుకు అండగా నిలిచే తీరు .. ఆడపిల్లల్లో భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాలి అనే సందేశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం .. హుషారెత్తించే పాటలు .. అందుకు తగిన కొరియోగ్రఫీ ఈ సినిమా సక్సెస్ లో  ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఈ సినిమా దూకుడు ఇప్పట్లో తగ్గనట్టే కనిపిస్తోంది మరి.

Advertisement
Irumudi
Ravi Teja
Shiva Nirvana
Irumudi Box Office Collections
Mythri Movie Makers
Irumudi Day 1 Gross

More Telugu News