ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది!
- విడుదలైన ఏపీ జాబ్ క్యాలెండర్
- 4 దశల్లో 10,060 ఉద్యోగాల భర్తీ
- సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా నోటిఫికేషన్లు
- ఉన్నత విద్యాశాఖలో ఇప్పటికే 1,500 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొత్తం 10,060 పోస్టుల భర్తీకి సంబంధించిన వార్షిక జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒకేసారి కాకుండా, ప్రణాళికాబద్ధంగా 4 దశల్లో భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగార్థులు సన్నద్ధమయ్యేందుకు వీలుగా నోటిఫికేషన్ల షెడ్యూల్‌ను కూడా ముందుగానే ప్రకటించింది. దీని ప్రకారం, ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఇప్పటికే 1,500 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
మిగిలిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 15న రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 5,306 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఒక నోటిఫికేషన్‌లో 2,311 పోస్టులు, మరో నోటిఫికేషన్‌లో 2,995 పోస్టులు ఉంటాయి.
దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి, అక్టోబర్ మధ్య నాటికి మొత్తం 10,060 పోస్టుల నియామక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాలెండర్‌కు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.