కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక గుర్తింపు.. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం
- అమెరికాలో భారతీయ పండుగకు గౌరవం.. దీపావళిని గుర్తించిన కాలిఫోర్నియా
- భారత సంతతి సభ్యులు దర్శన పటేల్, యష్ కల్రా చొరవతో తీర్మానానికి రూపకల్పన
- ప్రవాస భారతీయులకు, వారి సంస్కృతికి ఇది గొప్ప గౌరవమని హర్షం
- హిందూ, సిక్కు, బౌద్ధ, జైన సమాజాలకు దీపావళి ప్రాముఖ్యతను తీర్మానంలో ప్రస్తావన
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజల పట్ల తమకు ప్రగాఢమైన గౌరవం ఉందని ఈ తీర్మానంలో అసెంబ్లీ పేర్కొంది.
భారత సంతతికి చెందిన అసెంబ్లీ సభ్యులు దర్శన పటేల్, యష్ కల్రా ఆగస్టు 13న ‘హౌస్ రిజల్యూషన్ 137’ పేరుతో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ రూల్స్ కమిటీ పరిశీలన అనంతరం దీనికి ఆమోదం లభించింది. ఈ ఏడాది నవంబర్ 8న జరుపుకోనున్న దీపావళిని గుర్తిస్తూ, ఈ వేడుకల్లో కాలిఫోర్నియా ప్రజలు కూడా పాలుపంచుకోవాలని ఈ తీర్మానం ద్వారా అధికారికంగా పిలుపునిచ్చారు.
ఈ చారిత్రక పరిణామంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేసింది. "కాలిఫోర్నియా దీపావళి తీర్మానం అధికారికంగా ఆమోదం పొందింది" అని ప్రకటించింది. ఈ తీర్మానం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన దర్శన పటేల్, యష్ కల్రాలకు ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తీర్మానం రూపకల్పనలో తమను సంప్రదించినందుకు కృతజ్ఞతలు చెప్పింది.
తీర్మానంలో ఏముంది?
దీపావళి పండుగకు భారతీయ అమెరికన్లు, దక్షిణాసియా అమెరికన్ల జీవితంలో గొప్ప ప్రాముఖ్యత ఉందని ఈ తీర్మానంలో వివరించారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. ‘దీపావళి’ అంటే ‘దీపాల వరుస’ అని అర్థమని, ఇది ప్రపంచంలోని పురాతన పండుగల్లో ఒకటని తెలిపారు.
ఈ పండుగ కుటుంబాలు, స్నేహితులు, సమాజాన్ని ఒకచోట చేర్చి ఉదారత, ఐక్యత, ఆనందం, కృతజ్ఞత వంటి విలువలను చాటుతుందని తీర్మానం కొనియాడింది. దీపావళి దీపాలు చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అని అభివర్ణించింది. వ్యక్తిగత సవాళ్లు ఎదురైనా సానుకూల దృక్పథం, వినయం, దయను కొనసాగించాలనే సందేశాన్ని దీపావళి ఇస్తుందని పేర్కొంది. అనేక సమాజాలకు దీపావళి నూతన సంవత్సరానికి ఆరంభమని, ఇది జ్ఞానం, ఎదుగుదల, సంతోషానికి కట్టుబడి ఉండే సమయమని తీర్మానంలో పొందుపరిచారు.