జగన్‌వి గంజాయి బ్యాచ్ మీటింగ్‌లు: వర్ల రామయ్య
- మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న వర్ల
- దమ్ముంటే చర్చకు రావాలని జగన్‌కు బహిరంగ సవాల్
- డీఎస్సీపై వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందన్న ఎమ్మెల్సీ
- జగన్‌ను కౌరవులతో పోల్చిన టీడీపీ నేత
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడిన ఆయన, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మెగా డీఎస్సీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆధారాలతో సహా వివరించినప్పటికీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అధికారుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
"చర్చకు రండి లేదా అసెంబ్లీకి వచ్చి మీ సందేహాలు తీర్చుకోండి.. మేం సమాధానం చెబుతాం" అంటూ గతంలో నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను ప్రస్తావిస్తూ రామయ్య మరోసారి జగన్‌ను నిలదీశారు. జగన్‌ను కౌరవులతో పోల్చిన ఆయన.. సొంత తల్లి, చెల్లి కూడా ప్రస్తుతం ఆయనకు మద్దతుగా లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్వహిస్తున్న 'జెన్-జీ' సమావేశాలకు హాజరవుతున్నది 'గంజాయి బ్యాచ్' అని, అసలైన యువత లోకేశ్ వెంటే ఉందన్నారు. జగన్ హయాంలో గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిట్ నివేదికను ప్రస్తావిస్తూ, ఆయన విలువల్లేని రాజకీయాలు పతనానికి దారితీస్తాయని హెచ్చరించారు.