పోలవరం జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ఇద్దరి మృతి

Polavaram district road accident car hits lorry two killed
  • బోడుగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన
  • లారీని ఢీకొట్టి కాలి బూడిదైన కారు 
  • మృతులు తూర్పు గోదావరి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తింపు
పోలవరం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతూరు మండలం బోడుగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఒడిశా నుంచి ఇనుము లోడుతో తమిళనాడు వెళ్తున్న లారీని, వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కాగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అయ్యన్న (35)గా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన అడివి సూర్య వినయ్ తేజ (28)గా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.                              
Advertisement
Polavaram road accident
Chinturu
Nimmakayala Ayyanna
Surya Vinay Teja
Car fire accident
Andhra Pradesh road mishap

More Telugu News