షావుకారు జానకి మృతి పట్ల నారా లోకేశ్ స్పందన
- ప్రముఖ నటి షావుకారు జానకి మృతికి మంత్రి నారా లోకేశ్ సంతాపం
- 400 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని కొనియాడిన లోకేశ్
- వైవిధ్యమైన పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారన్న మంత్రి
- సినీ రంగానికి ఆమె సేవలు మరువలేనివని నివాళి
- ఆమె కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి
ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. షావుకారు జానకి సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. "తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించి, తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. తొలి చిత్రం 'షావుకారు' పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు" అని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.
"వైవిధ్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం" అని నారా లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. షావుకారు జానకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.