ఆయుర్వేద చికిత్స కోసం రేపు కేరళ వెళుతున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan to visit Kerala tomorrow for Ayurvedic treatment
  • భుజం నొప్పికి చికిత్స కోసం కేరళకు పవన్ కల్యాణ్
  • శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి పెద్దగా తీసుకోకుండా విధుల్లో చేరిక
  • భుజానికి వాపు, జ్వరం రావడంతో వైద్యుల సూచన
  • రేపు కేరళకు బయలుదేరనున్న ఉపముఖ్యమంత్రి
  • ఆయుర్వేద చికిత్సతో పూర్తిస్థాయిలో కోలుకోవడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కేరళకు పయనం కానున్నారు. తన భుజం నొప్పికి ఆయుర్వేద చికిత్స తీసుకునే నిమిత్తం ఆయన శనివారం కేరళకు వెళ్లనున్నట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల పవన్ కల్యాణ్ తన కుడి భుజం 'రొటేటర్ కఫ్' గాయానికి ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారు.

అయితే, పరిపాలనా బాధ్యతల దృష్ట్యా పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స జరిగిన వారంలోపే తిరిగి విధుల్లో చేరారు. ముందస్తుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలను ఆయన నిర్వహించారు.

విశ్రాంతి లేకుండా విధుల్లో పాల్గొనడం వల్ల ఆయన భుజానికి వాపు రావడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్లు జనసేన పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో, భుజం నొప్పి నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కేరళలో ప్రత్యేక ఆయుర్వేద చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించగా, ఆయన రేపు అక్కడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Pawan Kalyan
Kerala
Ayurvedic Treatment
Rotator Cuff Surgery
Janasena Party
Andhra Pradesh Deputy CM

More Telugu News