టైమ్ కి సెట్ కి రాకపోవడమే ఇప్పుడున్న పెద్ద సమస్య: రేలంగి నరసింహారావు

Relangi Narasimha Rao Interview
  • కుటుంబ కథా  చిత్రాల దర్శకుడిగా పేరు
  • ఎన్టీఆర్ - ఏఎన్నార్ క్రమశిక్షణకు మారుపేరని వ్యాఖ్య
  • ఇప్పుడు చాలామంది సెట్ కి లేట్ గా వస్తున్నారని వెల్లడి   
  • సెట్ లో స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని విమర్శ 
  • కారవాన్ కారణంగా  లేట్ చేస్తున్నారని వివరణ    
      
తెలుగు తెరపై కుటుంబ కథాచిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించిన దర్శకుడు రేలంగి నరసింహారావు. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలను .. తన మార్క్ హాస్యాన్ని జోడిస్తూ ఆయన రూపొందించిన సినిమాలు ఎంతో ఆదరణ పొందేవి. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన సినిమాలలో చాలావరకూ విజయాలను అందుకోవడం విశేషం. అలాంటి రేలంగి నరసింహారావు తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను ఎన్టీ రామారావుగారి సినిమాలకు .. అక్కినేని గారి సినిమాలకు పనిచేశాను. వాళ్లతో చాలా సన్నిహితంగా మసలుకున్నాను. సమయపాలన విషయంలో ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి. షూటింగ్ ఎక్కడ పెట్టినా .. ఏ వేళలో పెట్టినా చెప్పిన సమయానికంటే ముందుగానే అక్కడికి చేరుకునేవారు. వాళ్ల వైపు నుంచి ఎప్పుడూ ఎలాంటి ఆలస్యం ఉండేది కాదు. అంతగా వాళ్లు టైమ్ కి ప్రాధాన్యతను ఇచ్చారు. అలాంటి ఓ క్రమశిక్షణ ఈ కాలంలో చూడలేము" అని అన్నారు. 

"ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, 9 గంటలకు కాల్షీట్ అంటే 10:30 .. 11:00 గంటలకు సెట్ కి వస్తున్నారు. ఇక షాట్ గ్యాప్ లో కారవాన్ లోకి వెళుతున్నారు. అలా వెళ్లడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ అసిస్టెంట్లు వెళ్లి పిలవగానే రావడం లేదు. కారవాన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చోవడం వలన సమయం వృథా అవుతోంది. ఒకప్పుడు అందరం కలిసి ఒకేచోట కూర్చునే వాళ్లం. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పై సరైన కసరత్తు చేయకుండా సెట్ కి వెళ్లడం, అక్కడ టైమ్ వేస్టు చేయడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పారు.

Advertisement
Relangi Narasimha Rao
NT Rama Rao
Akkineni Nageswara Rao
Telugu Cinema Discipline
Tollywood Director Interview
iDream Media Interview

More Telugu News