ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందిగా?.. 14 ఏళ్లలో యూట్యూబ్ ద్వారా ఈ పాటకు వచ్చిన ఆదాయంపై ఏఐ అంచనా ఇదే!
- 14 ఏళ్లలో 6 బిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డ్
- యూట్యూబ్ ద్వారా కొన్ని పదుల మిలియన్ డాలర్ల ఆదాయం
- ఏఐ చాట్‌బాట్ గ్రోక్ వెల్లడించిన అంచనాలు
- సంగీత పరిశ్రమలో మార్పులకు కారణమైన పాట
సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2012లో ప్రపంచ సంగీత ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన పాట 'గంగ్నమ్ స్టైల్'. దక్షిణ కొరియా గాయకుడు 'సై' (PSY) పాడిన ఈ పాట యూట్యూబ్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విచిత్రమైన మ్యూజిక్ వీడియో, గుర్రపు స్వారీని అనుకరించే దాని ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంది.
ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే, యూట్యూబ్ చరిత్రలోనే 1 బిలియన్ వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది. విడుదలైన 14 సంవత్సరాల తర్వాత కూడా, నేటికీ దాదాపు 6 బిలియన్ల వీక్షణలతో యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఒక్క వీడియో ద్వారా సై, దాని హక్కుదారులు ఎంత సంపాదించి ఉంటారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ పాట యూట్యూబ్ ద్వారా ఎంత ఆదాయం సంపాదించి ఉంటుందని 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు 'గ్రోక్' అనే ఏఐ చాట్‌బాట్ ఆసక్తికరమైన అంచనాలను వెల్లడించింది. దీని ద్వారా వచ్చిన మొత్తం ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవని పేర్కొంది. అయితే, 2013లో ఈ వీడియో 1.2 బిలియన్ వ్యూస్ సాధించినప్పుడు, ప్రకటనల ద్వారా 8 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని గూగుల్ వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది.
ప్రస్తుత వ్యూస్ సంఖ్య, మ్యూజిక్ వీడియోలకు సాధారణంగా ఉండే ప్రకటనల రేట్లను బట్టి, 'గంగ్నమ్ స్టైల్' హక్కుదారులు కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారానే కొన్ని పదుల మిలియన్ల డాలర్లు (రూ.వందల కోట్లు) సంపాదించి ఉండవచ్చని గ్రోక్ అంచనా వేసింది. ప్రతి 1,000 వ్యూస్‌కు 1 నుంచి 3 డాలర్ల వరకు ఆదాయం వస్తుందని లెక్కగట్టింది.
దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటపై వచ్చిన పేరడీలు, కవర్ సాంగ్స్ ద్వారా 'కంటెంట్ ఐడీ' రూపంలో అదనపు ఆదాయం కూడా వచ్చి ఉంటుందని గ్రోక్ వివరించింది. ఇదే అంశంపై మెటా సంస్థ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చింది. యూట్యూబ్ ఆదాయం పూర్తిగా బయటకు వెల్లడి కాదని, ప్రకటనల రేట్లు ప్రాంతాన్ని, సమయాన్ని బట్టి మారుతాయని పేర్కొంది. ఈ అంచనాలన్నీ కేవలం యూట్యూబ్ ప్రకటనలకు సంబంధించినవేనని, పాట డౌన్‌లోడ్‌లు, లైసెన్సింగ్, ప్రచార ఒప్పందాలు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం దీనికి అదనమని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఒక్క పాట సైను అంతర్జాతీయ సూపర్‌స్టార్‌గా మార్చేసింది. ఇంగ్లీష్‌లో లేని ఒక పాట కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంతటి విజయాన్ని సాధించగలదని నిరూపించింది. అంతేకాదు ఈ పాట విజయం సంగీత పరిశ్రమపై కూడా చెరగని ముద్ర వేసింది. ఒక పాట ప్రజాదరణను అంచనా వేయడంలో యూట్యూబ్ వ్యూస్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఎంత కీలకమో ఇది చాటిచెప్పింది. దీని ప్రభావంతోనే ప్రఖ్యాత 'బిల్‌బోర్డ్' సంస్థ తమ చార్ట్‌ల లెక్కింపు పద్ధతిలో యూట్యూబ్, స్ట్రీమింగ్ డేటాను కూడా చేర్చడం ప్రారంభించింది. ఇది సంగీత ప్రపంచంలోనే ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది.