సీఎం విజయ్ దినచర్య 4 గంటలకు ప్రారంభం.. రోజుకు 20 గంటలు పని చేస్తారు: ఆధవ్ అర్జున
- ప్రజల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తారన్న మంత్రి
- ప్రభుత్వంలో పారదర్శకతే లక్ష్యంగా పనిచేస్తున్నారని వెల్లడి
- అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారన్న మంత్రి ఆధవ్ అర్జున
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రతిరోజూ సుమారు 20 గంటలు పాటు నిరంతరం శ్రమిస్తారని రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున పేర్కొన్నారు. చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే' తమిళనాడు కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి పనితీరును ప్రశంసలతో ముంచెత్తారు.
ముఖ్యమంత్రి విజయ్ దినచర్య తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమవుతుందని ఆధవ్ అర్జున తెలిపారు. ఆ రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలు, శాఖాపరమైన అంశాలపై ఆయన మంత్రులతో చర్చిస్తారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం వేడుకలకు దూరంగా ఉంటూ, పాలనపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు అధికారులతో ఆయన నిరంతరం సమీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
ప్రజల సమస్యల పరిష్కారం, మంత్రిత్వ శాఖల్లోని లోపాలను సరిదిద్దడమే ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రజాహితం కోసమే శ్రమించాలని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలనలో పారదర్శకతను పెంపొందించాలని ముఖ్యమంత్రి తన బృందానికి నిరంతరం దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
రాష్ట్రానికి అవినీతే అతిపెద్ద సమస్య అని ముఖ్యమంత్రి విజయ్ బలంగా విశ్వసిస్తారని ఆధవ్ అర్జున పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆర్థిక లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో ఇంకా అవినీతి కొనసాగుతోందని, త్వరలోనే దానిని కూడా పూర్తిగా నిర్మూలిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.